అయితే కొన్ని ఎయిర్ పోర్టులు చిన్నగా ఉంటాయి. అక్కడ ఉన్న వెదర్ కండిషన్ లను బట్టి ఆయా ఎయిర్ పోర్టులను నిర్మించారు. ప్రపంచంలో అతి చిన్న ఎయిర్ పోర్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేస్తే డచ్ కరేబియన్ ద్వీపం అయినా సబాలో అతి చిన్న ఎయిర్ పోర్టు ఉంది. ఇది జరాంబో యారస్కిన్ గా పేరు గాంచింది. ప్రపంచంలో అతి చిన్న వాణిజ్య రన్ వే కలిగిన విమానాశ్రయంగా దీన్నిపిలుస్తుంటారు.
ఇందులో విన్ డైర్ అనే విమానాయాన సంస్థ రోజూ రెండు ఫ్లైట్ లను ఇక్కడ నుంచి నడిపిస్తుంటుంది. సౌతాఫ్రికాలో రి లెసెతో నగరంలో ఉన్న మరో విమానాశ్రయం మోషోషో. ఇది మాసేరు సిటీకి సేవలు అందిస్తుంది. కాాగా లెసెతో నగరానికి రాజుగా 1820 నుంచి 1870 వరకు ఉన్న మోషోషో పేరు మీదనే ఈ విమానాశ్రయంను పిలుస్తుంటారు. దీని రన్ వే కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.
స్కాట్లాండ్ లోని బర్రా ఎయిర్ పోర్టు ఇది చాలా చిన్నగా ఉంటుంది. దీనికి మరో పేరు ఉంది బర్రా ఎబిలిగారీ ఎయిర్ పోర్టు అంటారు. నేపాల్ లోని టెన్నింగ్ -హిల్లరీ ఎయిర్ పోర్టు, అమెరికా లోని వెస్ట్ వర్జీనీయా రాష్ట్రంలోని మోర్గాన్ టౌన్ ఎయిర్ పోర్టు లు చిన్నగా ఉంటాయి. ఆయా ఎయిర్ పోర్టుల నుంచి వాణిజ్య అవసరాల రీత్యా ఫ్లైట్లు నడుస్తుంటాయి.