JAISW News Telugu

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఫామ్ హౌస్ లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?

FacebookXLinkedinWhatsapp
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi :  చిరంజీవి అంటేనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పెద్దన్న లాంటివారు. మెగాస్టార్ చిరంజీవి పడిన కష్టం అంతా ఇంతా కాదు. తెలుగు తెరపై మెగాస్టార్ గా ఆయన  ఎన్నో అష్ట కష్టాలు పడ్డారు. చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత తెలుగు సినిమా అని ఎంతోమంది పెద్ద డైరెక్టర్లతో సహా ప్రతి ఒక్క సామాన్యుడు అనుకుంటారు.
అంతలా ప్రజల జీవితాల్లోకి చిరంజీవి సినిమాలు వెళ్లాయి.
ఆయన నటన, డ్యాన్స్, మాటలు అన్నీ కూడా ఎంతోమందిని ఇన్స్పైర్ చేశాయి. అలాంటి చిరంజీవి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్నారు. హీరోగా ఒక వెలుగుతున్న సమయంలో ఆయన చాలా ఆస్తులు కొనుగోలు చేశారు. బెంగళూరులో సిటీకి 35 కిలోమీటర్ల దూరంలో ఒక ఫామ్ హౌస్ ని కొన్నారు. దాని విలువ రూపాయలు 35 కోట్లని ఒక మ్యాగజైన్ ప్రచురించింది. అది బెంగుళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి దగ్గరగా ఉంటుంది.
  చిరంజీవి హైదరాబాదులోని కోకాపేటలో కూడా భూములు కొన్నారు. ప్రస్తుతం కోకాపేటలో ఉన్న చిరంజీవి ఫామ్ హౌస్ రూపాయలు 200 కోట్లకు పైగా విలువ చేస్తుందని తెలుస్తోంది. కోకాపేటలోనే సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ జరిగింది.  కానీ అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో కోకాపేటలో చిరంజీవి ఫామ్ హౌస్ గురించి అందరికీ తెలిసిపోయింది.
 అయితే తాజాగా ఊటీలో కూడా ఒక ఐదు ఎకరాలలో ఫామ్ హౌస్ కు సంబంధించిన స్థలం కొన్నట్లు తెలుస్తోంది. హాలిడేస్ లో ఊటీలో ఫ్యామిలీతో సహా ఉండేందుకు అక్కడ ఫామ్ హౌస్ నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. చిరంజీవి తన ఆస్తుల విలువ కేవలం ఫామ్ హౌస్ ల ద్వారానే రూ. 300 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. బెంగళూరు ఫామ్ హౌస్ రూ. 35 కోట్లు, కోకాపేటలో  200 కోట్లు, ఊటీలో ఫామ్ హౌస్ మరో 40, 50 కోట్ల వరకు ఉంటుంది. దాదాపు 300 కోట్ల వరకు ఫామ్ హౌస్ లా వ్యాల్యూ ఉంటుందని మ్యాగజైన్ ప్రచురించిన  వార్తను బట్టి తెలుస్తోంది.
Exit mobile version