Ram Lalla : బాలరాముడు విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందో తెలుసా?
Ayodhya Ram Lalla : అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా ఘనంగా నిర్వహించారు. రాముడి విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? ఎక్కడ చదువుకున్నారు? అనే అంశాలు అందరి మదిలో మెదలడం సహజమే. చిన్నప్పుడు రాముడు చదువుకున్న ప్రాంతం చూస్తే మనకు కూడా ఎంతో ముద్దుగా అనిపించవచ్చు. అందుకే అయోధ్యకు వెళితే ఆ ప్రాంతాన్ని సందర్శించడం మరిచిపోవద్దనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాముడి విద్యాభ్యాసం అంటే గుర్తుకు వచ్చేది గురు వశిష్ట భూమి. బస్తీ జిల్లాలోని ప్రతి మూలలో రాముడి జ్ణాపకాలు ఉంటాయి. త్రేతా యుగంలో రాముడు నడయాడిన నేలతో అందరికి అనుబంధం ఉంటుంది. అక్కడ ఎటు చూసినా రాముడి జ్ణాపకాలు కనిపిస్తాయి. యూపీలోని బస్తీలోని కప్తంగంజ్ బ్లాక్ ఏరియాలోని బధాని మిశ్రా గ్రామంలో గురు వశిష్ట ఆశ్రమం ఉంది.
బస్తీ లోని బధాని ఆశ్రమంలో రాముడు తన ముగ్గురు సోదరులతో కలిసి విద్యాభ్యాసం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆశ్రమానికి కొద్ది దూరంలో ఐతుక్ ప్రాంతం ఉంటుంది. దీన్ని ఐతుక్ పూర్ అని పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా చేస్తోంది. అయోధ్యకు వెళ్లే వారు రాముడి విద్యాభ్యాసం చేసిన ప్రాంతాన్ని కచ్చితంగా దర్శించుకుంటే రాముడి జ్ణాపకాలు ఆనందపరుస్తాయి.
అయోధ్యకు బస్తీ ప్రాంతం 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మొత్తం విద్యాభ్యాసం కొనసాగింది. బాల రాముడి విద్యాభ్యాసం కొనసాగింది అక్కడే. అయోధ్యను దర్శించుకునే సమయంలో రాముడి విద్యాభ్యాసం చేసిన ప్రాంతాన్ని కూడా దర్శించుకుంటే మంచిది. ఆ ప్రాంతాన్ని అక్కడి ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా మారుస్తోంది. రాముడు నడిచిన నేలను అందంగా తీర్చిదిద్దుతోంది.