Varun Tej : పెళ్లయిన పది రోజులైనా కాకముందే.. వరుణ్ తేజ్ ఏం చేశాడో తెలుసా?
Varun Tej : దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకొని అందులో మీడియాకు చిక్కకుండా గుట్టుకు లవ్ ట్రాక్ నడిపి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి. వరుణ్ తేజ్ కోరుకున్నట్లుగానే తన ఇష్ట సఖిని వివాహం చేసుకున్నాడు. నిశ్చితార్థం నుంచి ఈ జంట ఏం చేసినా అది సెన్సేషనల్ అవుతూ వస్తుంది. పెళ్లికి ముందే ప్రీ హనీమూన్ అంటూ వారు ఇటలీలో సందడి చేసిన పిక్ లు వైరల్ కావడంతో కొంత దుమారం చెలరేగినా.. అంతగా ఎవరూ పట్టించుకోలేదు.
ఇక, నవంబర్ 1వ తేదీ వరుణ్ తేజ్ లావణ్య మెడలో తాళి కట్టి తన ఇంటిదాన్ని చేసుకున్నాడు. పెళ్లికి ముందు నుంచి చాలా ఈవెంట్లలో పాల్గొంది ఈ జంట. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన విందులో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా పాల్గొంది. ఆ తర్వాత పెళ్లి వివాహం అనంతరం హైదరాబాద్ కు వచ్చిన జంట నవంబర్ 5వ తేదీన భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఇందులో టాలీవుడ్ తో పాటు బలీవుడ్ వరకు నటులు, పొలిటీషియన్స్ పాల్గొన్నారు. నూతన జంటను ఆశీర్వదించి మెగా ఆతిథ్యం తీసుకొని వెళ్లారు.
పెళ్లి తంతు ముగియడంతో హనీమూన్ కు ఎక్కడికి వెళ్తారని సోషల్ మీడియాలో దుమారం మొదలైంది. ఆ దుమారాన్ని కట్టి పెట్టేందుకు వరుణ్ తేజ్ సైలెంట్ గా లావణ్యను విడిచిపెట్టి ఫ్లయిట్ ఎక్కాడు. లావణ్య త్రిపాఠి లేకుండా వరుణ్ తేజ్ ఎయిర్ పోర్టులో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొత్తగా పెళ్లయిన తర్వాత లావణ్యను ఎందుకు విడిచిపెట్టి వెళ్తున్నాడు? అని అందరూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంకా పెళ్లి తంతు ముగిసి పది రోజులైనా కాకుండానే వరుణ్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటూ అనుకుంటున్నారు.
అసలు వరుణ్ తేజ్ ఎక్కడికి వెళ్తున్నాడని ఆరా తీస్తే.. తన తర్వాత సినిమా ప్రొడక్షన్ పనుల కోసం ముంబై బయల్దేరాడు. వివాహం జరిగిన వెంటనే ఈ పనులు ఏంటి నాయనా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లావణ్య త్రిపాఠి ఎంత బాధపడుతుందని అంతా అనుకుంటున్నారు. కానీ లావణ్యనే కెరీర్ ఇంపార్టెంట్ అంటూ చెప్పి పంపించిందట. హనీమూన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఆఫర్లు తర్వాత వస్తాయో రావో అని చెప్పి పంపించిందట. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం 2 ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. 1. మట్కా, 2. ఆపరేషన్ వాలంటైన్. రెండో ప్రాజెక్ట్ పూర్తయి రిలీజ్ కు సిద్ధంగా ఉంది.