JAISW News Telugu

Beer : బీర్ తాగేప్పుడు ఏం తినాలో.. ఏం తిన కూడదో తెలుసా..? వీటిని తింటే ఆ సమస్యలు..!

Beer

Beer

Beer : బీర్ అంటే యూత్ కు చాలా ఇష్టమైన లిక్కర్ అని తెలిసిందే. ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఇద్దరు, ముగ్గురితో కలిసి చేసుకునే బర్త్ డే లాంటి సెలబ్రేషన్ అయినా బీర్ ఉండాల్సిందే. ఇంకా కొందరు స్నేహితులతో పిచ్చా పాటి మాట్లాడుకునేప్పుడు కూడా బీర్లు ఉండాల్సిందే. ఇలా కొందరు డెయిలీ హ్యాబిట్ గా కూడా పెట్టుకుంటారు.

బీరు తాగేప్పుడు కొందరు మంచింగ్ కూడా తీసుకుంటారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను బీర్ తాగేప్పుడు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయట. అందువల్ల బీరుతో పాటు తీసుకోకూడనివి, తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా ఆల్కహాల్ తీసుకునేవారు ఎగ్ ఆమ్లేట్, పకోడి, బజ్జీలు, చికెన్ ప్రైడ్ పీస్, మటన్, పండ్లు లాంటివి తీసుకోవడం కామనే. కానీ బీరుతో మాత్రం కొన్నింటినే తీసుకోవాలంట. అవేంటంటే మసాలా ఎక్కువగా ఉన్నవి చికెన్, మటన్ లాంటివి తీసుకోవద్దట. ఇవి తీసుకుంటే యాసిడ్ రిఫ్లక్స్ ప్రాబ్లమ్స్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ లాంటి ఉదర సంబంధిత సమస్యలు వస్తాయట.

వీటితో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ లాంటివి కూడా తీసుకోవద్దంట. ఇందులో అధికంగా సోడియం ఉంటుంది. అందుకే వీటిని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందట. అందువల్ల ఎగ్ వైట్‌తో చేసిన వంటలు, ఉడికించిన వేరుశెన, చేపలు, మొలకెత్తిన గింజలు, కొన్ని రకాల పండ్లు వంటికి బీరు తాగే సమయంలో మంచింగ్‌గా తీసుకోవాలంట. బీరు చల్లగా ఉంటుంది కాబట్టి స్టమక్ లో గ్యాస్ ను చల్ల బరుస్తుంది. కాబట్టి బీరు తీసుకునే సమయంలో హెవీ ఫుడ్ తీసుకోకపోవడమే అన్నింటికన్నా మంచింది.

Exit mobile version