Revanth Reddy : పార్టీని పవర్ లోకి తెచ్చేందుకు రేవంత్ ఏం చేస్తున్నారో తెలుసా?

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు వన్ అండ్ ఓన్లీగా వ్యవహరిస్తున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఏక కాలంలో అనేక పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. రెండు మూడు నియోజకవర్గా్లలో ప్రచారం చేయడం.. తన సొంత నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, కేడర్ తో మాట్లాడడం, ఇక ఢిల్లీ నుంచి పెద్దలు వస్తే రిసీవ్ చేసుకోవడం, పార్టీలో చేరే వారితో మంతనాలు, పార్టీ నుంచి వీడిపోవాలనుకునే వారికి బుజ్జగింపులు చేస్తూ వన్ అండ్ ఓన్లీగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ లో అగ్ర నాయకులు, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చేసే పనులు, కాంగ్రెస్ లో దాదాపు రేవంత్ ఒక్కరే చేస్తున్నారనడంలో సందేహం లేదు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నేతలు, కేడర్ కొదువలేదు. ఉమ్మడి రాష్ట్రాన్ని కొన్నేళ్లుగా పాలించిన పార్టీ కాంగ్రెస్. పైగా రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కూడా గుర్తింపు సంపాదించుకుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేతలకు కొదువ లేదు. కానీ రేవంత్ వారందరూ రేవంత్ రెడ్డిలాగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ ప్రచారం చేయలేరు. పైగా వారిలో ఎక్కువ మంది వృద్ధులుగా ఉన్నారు కాబట్టి వారి స్పీచ్ లో అంత పస కనిపించదు.

వీటన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించడం, బీఆర్ఎస్ లీడర్ కేసీఆర్ ను సమర్థంగా ఎదుర్కోనే నేతగా రేవంత్ ప్రజల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు. వ్యూహ, ప్రతి వ్యూహాలు పన్నడంలో కూడా రేవంత్ ధిట్ట. ఆయన ప్రసంగాలతో జనాలను ఆకర్షిస్తున్నాడు. దీంతో ఆయన బహిరంగ సభలు, రోడ్ షోలకు విపరీతమైన ఆధరణ కనిపిస్తుంది. ఇదంతా పార్టీకి ప్లస్ గా మారుతుంది. అందుకే కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ నిలబడేందుకు ఇవన్నీ కారణాలుగా చూపించి ఢిల్లీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తం తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేస్తూ.. కష్ట పడుతుంటే.. సీనియర్ నేతలు తమ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. తమ పరపతితో టికెట్లు ఇప్పించుకున్న వారిని గెలిపించేందుకు కూడా సమయం కేటాయించడం లేదు. వారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనడం లేదు. దీంతో రేవంత్ రెడ్డి సీనియర్ నేతలను డామినేట్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది.  ఏది ఏమైనా రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఒంటి చేతితో కాంగ్రెస్ ను పవర్ లోకి తీసుకువచ్చాడన్న మాటలు కూడా వినబోతాం.

TAGS