JAISW News Telugu

Peepal Tree : రావి చెట్టు విశిష్టత ఏంటో తెలుసా?

Peepal Tree

Peepal Tree

Peepal Tree : మనం జంతువులు, చెట్లు, బండలను పూజిస్తాం. దేవతామూర్తులుగా కొలుస్తాం. దసరాకు జమ్మి చెట్టు, కార్తీక పౌర్ణమికి ఉసిరి, శనివారం రోజు రావి చెట్టును పూజించడం ఆనవాయితీ. రావి చెట్టు దేవతలకు ప్రతిరూపంగా చెబుతుంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు రావి చెట్టు అత్యంత ప్రీతిపాత్రమైందని అంటుంటారు. ఇలా రావికి ఉన్న ప్రాధాన్యం ఏంటో తెలుసుకుని ప్రవర్తిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

మన దారిద్య్రం దూరం కావాలంటే రావి చెట్టును పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటారు. మనసులోని కోరికను చెప్పుకుని రావి చుట్టు ప్రదక్షిణలు చేయడం వల్ల కోరికలు తీరుతాయని నమ్మకం. రావి చెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదు. దానికి కూడా ఓ వారం నిర్ణయించారు. అదే శనివారం రోజు రావి చెట్టును పూజించడం చాలా మంచిది.

రావి చెట్టును ఏ రోజు పడితే ఆ రోజు తాకడం వల్ల దోషం కలుగుతుంది. శనివారం రోజు మాత్రమే ఈ చెట్టును తాకడంతో పుణ్యం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు. రావి దేవతల చెట్టుగా భావిస్తారు. విష్ణు రూపంగా పూజిస్తారు. శనివారం రావి చెట్టును తాకాలని చెబుతారు. ఇలా రావి చెట్టును దేవతలకు ప్రతిరూపంగా కొలుస్తుంటారు.

ఇలా రావి చెట్టు గొప్పతనం తెలుసుకుని ప్రవర్తిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. రావిచెట్టును పూజిస్తే ఎన్నో లాభాలు కలుగుతాయి. రావి చెట్టు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే దీన్ని మహిళలు ఎంతో గౌరవ ప్రదంగా పూజిస్తుంటారు. కోరుకున్న కోరికలు నెరవేరాలంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలని సూచిస్తుంటారు. అందుకే రావి చెట్టు చుట్టు తిరుగుతూ తమ కోరికలు తీర్చాలని కోరుకోవడం సహజమే.

Exit mobile version