JAISW News Telugu

AI technology : చైనాలో ఏఐ టెక్నాలజీ ద్వారా ఏం చేశారో తెలుసా..!

AI technology

AI technology

AI technology : ప్రస్తుత సమాజంలో ఏఐ టెక్నాలజీని నిత్య జీవితంలో ప్రతి ఒక్క విషయాల్లో ఉపయోగించడం అలవాటు చేసుకుంటున్నారు. ఏఐ టెక్నాలజీ ద్వారా అనేక రకాల ఉద్యోగాలు పోతున్నాయని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరి కొంతమంది మాత్రం  ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని నూతన విధానాల ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చని నిరూపిస్తున్నారు.
ఇలాంటి ఏఐ టెక్నాలజీని వాడుకోవడంలో చైనా వాళ్ళు చాలా ముందంజలో ఉన్నారు. చైనాలోని ఒక రైల్వే స్టేషన్ లో కావాలనే ఒక అగ్ని ప్రమాదాన్ని సృష్టించి దానిని ఏఐ టెక్నాలజీ ద్వారా ఎలా సేవ్ చేశారో చేసి చూపించారు. రైల్వే స్టేషన్ లో ఒక ప్రాంతంలో చిన్నపాటి అట్టేలను పెట్టి వాటిని కాల్చి నిప్పంటించారు. అయితే అక్కడే సమీపంలో ఉన్న ఏఐ టెక్నాలజీతో ఉపయోగించే స్ప్రింక్లర్ అక్కడ అగ్ని ప్రమాదం జరుగుతున్న దాన్ని ముందుగా గమనించింది. అగ్ని ప్రమాదం జరుగుతున్న ప్రాంతాన్ని వీడియో తీసింది.
అనంతరం వెంటనే ఆ ఏఐ టెక్నాలజీ ఉపయోగించే స్ప్రింక్లర్ నేరుగా ఆ అగ్ని ప్రమాదం జరుగుతున్న ప్రాంతంలో నీళ్లను కుమ్మరించింది. అత్యంత వేగంగా మంటలు ఆర్పేసింది. మంటలు ఆర్పడానికి ఒక ఫైరింజన్ మాదిరిగా ఏఐ టెక్నాలజీ పనిచేసింది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మంటలను ఆర్పే విధానం కూడా ఉపయోగించవచ్చని చైనా రైల్వే స్టేషన్ లో అధికారులు గుర్తించారు.
 తద్వారా ఈ టెక్నాలజీ ద్వారా చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు కూడా అరికట్టవచ్చని అర్థమవుతుంది. ప్రస్తుతం ఇండియాలో అనేక భవంతులకు అగ్ని ప్రమాదాల నుండి కాపాడుకునే శక్తి లేదు.చాలా ప్రాంతాలు ఇరుకుగా ఉంటాయి. మరికొన్ని షాపింగ్ మాల్ లో సేఫ్టీ పాటించరు. అయితే ఈ ఏఐ టెక్నాలజీని ఎయిర్పోర్ట్లు , రైల్వేస్టేషన్ లు, బస్టాండ్లలో ఉపయోగిస్తే అనేక రకాలుగా ఉపయోగపడుతుందని అగ్ని ప్రమాదాల నుంచి ఈజీగా తప్పించుకోవచ్చని చాలామంది నిపుణులు చెబుతున్నారు.
Exit mobile version