Alcohol : దేశవ్యాప్తంగా చూస్తే చాలా మందికి మద్యం తాగే అలవాటు ఉంది. కానీ ఈ అలవాటు అతిగా ఉంటే ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో మన కళ్ల ముందు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరికీ మితిమీరిన మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు, అయినా చాలా మంది ప్రజలు దానిని మానుకోవాలని అనుకోరు. అసలు ఉన్నట్లుంది మద్యం తాగడం మానేస్తే ఏమవుతుంది. రోజూ మందు వేసుకునే వారు నెల రోజులు ఆపేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారు నెల రోజుల పాటు మందు మానేస్తే కాలేయం, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో మార్పు వస్తుంది. రాత్రి బాగా నిద్రపడుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఆందోళన సమస్య తగ్గుతుంది. ఆల్కహాల్ మానేయడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. స్టామినాను మెరుగుపరుస్తుంది. కాబట్టి మీరు మందు తీసుకోవడం మానేస్తే, అది మీ శరీరానికి, మనస్సుకు మంచిది.
అయితే ఒక్కసారిగా మద్యం మానేస్తే మూడు నాలుగు రోజులు కష్టమే.. కానీ ఆ తర్వాత అంతా సర్దుకుపోతుంది. రాత్రి బాగా నిద్రపడుతుంది. మీరు ఆల్కహాల్ తాగడం మానేస్తే అది బరువు తగ్గడానికి దారితీస్తుంది. శరీరం మంచిగా మారుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. ఇది మీ బరువును తగ్గించడంలో మాత్రమే కాకుండా మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఆల్కహాల్ గుండెపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మీరు ఒక నెల పాటు మద్యం సేవించకపోతే మీ గుండెపై సానుకూల ప్రభావం చూపుతుంది.
హార్ట్ స్ట్రోక్ వంటి గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు.. మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఆల్కహాల్ తాగడం మానేస్తే, అది పాడైపోయిన కాలేయాన్ని రిపేర్ చేస్తుంది. క్రమం తప్పకుండా ఆల్కహాల్ తీసుకోవడం కాలేయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రాను రాను లివర్ చెడిపోవడం మొదలవుతుంది. దానివల్ల మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేరు. ఔషధ వినియోగం తగ్గించండి. లేదా పూర్తిగా నివారించండి. ఇలా చేయడం వల్ల మీ కాలేయం సాధారణ స్థితికి వస్తుంది. అందుకే 30 రోజుల పాటు ఆల్కహాల్ మానేస్తే మీ శరీరంలో వచ్చే మార్పులను చూసి మీరు ఆశ్చర్యపోతారు.