HanuMan : ప్రతి ఏటా సంక్రాంతికి సినిమాలు రావడం సహజమే. ఈ సంక్రాంతికి కూడా కొత్త సినిమాలు బరిలో నిలిచాయి. పెద్ద సినిమాలో చిన్న సినిమాలు కూడా ప్రభావితం చూపుతుంటాయి. అందులో ప్రస్తుత ఏడాది చిన్న సినిమా అయినా హనుమాన్ సినిమా కూడా పోటీలో నిలిచింది. ఈ నెల 12న విడుదల అయింది. ప్రీమియర్ షోలు కూడ వేశారు. ఒక రోజు ముందుగా వేసిన ప్రీమియర్ షోలకు జనం ఎక్కువ మంది రావడంతో సినిమా హిట్ ఖాయమనే టాక్ వస్తోంది.
పెద్ద సినిమాల విడుదలతో చిన్న సినిమాల వారు భయపడటం మామూలే. కానీ ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ పెద్ద సినిమాలతో పోటీ పడుతూ విడుదల చేస్తున్నారు. అతడి ధైర్యమేంటనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. పది ఇరవై థియేటర్లలో ప్రీమియర్ షోలు వేయాలని భావించినా థియేటర్ల సంఖ్య రెండు మూడు వందలకు చేరడం గమనార్హం. సినిమాకు వస్తున్న క్రేజీ కూడా అలాగే ఉంది.
హనుమాన్ సినిమా సీక్వెల్ కూడా రాబోతోందట. జై హనుమాన్ పేరుతో దీన్ని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారట. ఈనేపథ్యంలో హనుమాన్ మూవీ సందడి చేయడం తప్పనిసరని అంటున్నారు. హనుమాన్ సీక్వెల్ 2025లో వస్తుంది. దీనికి గాను కథను ప్రశాంత్ వర్మ సిద్ధం చేస్తున్నాడట. దీంతో హనుమాన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన హిట్ గా నిలుస్తుందని సమాచారం.
రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? అనే కోణంలో సినిమా నిర్మాణం జరిగింది. రామాయణం చాలా సార్లు చూశాం. ఎన్నిసార్లు చూసినా అందులో ఏదో కొత్తదనం ఉంటుంది. సినిమా మొత్తం ఈ అంశం మీదే తిరుగుతుంది. ఇందులో ఏముందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తీశాడనే టాక్ వస్తోంది.