Symptoms of Kidney Failure : మన శరీరంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మన శరీరంలోని ఐదు లీటర్ల రక్తాన్ని వడపోయడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మన శారీరక వ్యవస్థ కుదేలైపోతుంది. అవయవాలు దెబ్బతింటారు. రక్తసరఫరా జరగకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీలు పాడైతే తిరికి ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకునే శక్తి మనకు లేదు. దానికి చాలా డబ్బు ఖర్చవువుతుంది. అందుకే వాటిని పాడు కాకుండా చూసుకోవడమే ఉత్తమం.
కిడ్నీలు పాడై పోయాయని తెలియడానికి కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తాయి. అవి కనిపిస్తే మనం వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. మధుమేహం, రక్తపోటు నియంత్రణలో లేకపోతే కిడ్నీలు దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాటిని ఎప్పుడు నియంత్రణలోనే ఉంచుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.
కిడ్నీలు చెడిపోయాయని చెప్పడానికి కొన్ని ఆనవాళ్లు కనిపిస్తాయి. మన పాదాలు ఉబ్బుగా ఉంటాయి. రాత్రిళ్లు మూత్రానికి ఎక్కువసార్లు పోవాల్సి వస్తుంది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు వస్తాయి. రక్తం ముదురు రంగులో కాకుండా లేత రంగులో ఉంటుంది. శరీరం అలసటకు గురవుతుంది. వాంతులు, వికారం వంటి లక్షణాలు మనకు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
కిడ్నీలు మన శరీరంలో ప్రధాన విధులు నిర్వహిస్తాయి. మన రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణమయ్యేలా కూడా పనిచేస్తాయి. అందుకే కిడ్నీలు బాగుండేలా సరిపడ మంచినీళ్లు తాగాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన కిడ్నీలు పది కాలాల పాటు పదిలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.