JAISW News Telugu

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ను అక్కడి ప్రేక్షకులు ఆదరించకపోవడానికి కారణమేంటో తెలుసా?

Junior NTR

Junior NTR

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినిమా హీరోనే కాదు. పాన్ ఇండియా లెవల్లో చాలా క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ హీరో. యంగ్ ఎన్టీఆర్ డైలాగ్, డ్యాన్స్ లకు తెలుగులో ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్యే దేవర సినిమాలో పాన్ ఇండియా లెవల్లో మరో సారి తళుక్కున మెరిశాడు. కానీ ఈ సినిమా కేవలం రూ. 300 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి కాస్త నిరాశ పరిచింది.

దేవర మూవీలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కు జోడిగా నటించింది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించగా.. దీనిపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా సక్సెస్ సాధించినా కలెక్షన్ల పరంగా చాలా వీక్ అని చెప్పొచ్చు. బాలీవుడ్, పాన్ ఇండియా రేంజ్ లో మూవీలు దాదాపు రూ. 1000 కోట్లు కలెక్ట్ చేయాలి.

ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిపోయారు. వీరి సినిమాలపై పూర్తిగా అంచనాలు పెరిగిపోయాయి. వీరి సినిమాల కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఇలా పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన వీరు రాబోయే కాలంలో మరింత మంచి సినిమాలు హై రేంజ్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతే వారి స్టార్ డమ్ మళ్లీ దిగిరావచ్చు.

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు, హిందీలో మాత్రమే ఎక్కువగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ జూనియర్ ఎన్టీఆర్ ను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో కూడా ఇలాగే కొనసాగుతుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సౌత్ ఇండియాలోని మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులను మెప్పించాలి. ఆ తర్వాత పాన్ ఇండియా  లెవల్లో దృష్టి సారించాలి. అంటే సౌత్ ఇండియాలోని మిగతా ప్రాంతీయ భాషల్లో ఉన్ కథలను ఎంచుకుని సినిమాలు చేస్తే ఆయా రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు తొందరగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

Exit mobile version