Winners Prize Money : ఒకటి కాదు రెండు కాదు దాదాపు వంద కోట్లు. అవును దాదా టీ-20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు లభించే క్యాష్ ప్రైజ్. అంతేకాకుండా ఇంకా కోట్ల విలువైన ఇతర పారితోషికాలు ఉన్నాయి.
టీ-20 ప్రపంచ కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాను ఓడించిన టీం ఇండియా విజేతగా నిలిచింది. పదకొండేళ్ల తర్వాత భారత్ ఖాతాలో ఐసీసీ ట్రోఫీ చేరడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 2013లో ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అతడి సారథ్యంలోనే 2007 పొట్టి కప్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రోహిత్ కెప్టెన్ గా 2024 టీ-20 ప్రపంచ కప్ లో విశ్వవిజేతగా భారత్ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఏడు పరుగుల తేడాతో టీం ఇండియా గెలిచింది. విజేత భారత్ కు, రన్నరప్ గా నిలిచిన దక్షిణాఫ్రికాకు భారీ మొత్తంలోనే ప్రైజ్ మనీ దక్కింది. సెమీస్ లో నిష్క్రమించిన జట్లకూ ఐసీసీ ప్రైజ్ మనీని అందించింది.
టీ-20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ మొత్తం విలువ రూ.93.80 కోట్లు ఉండగా విజేత భారత్ కు రూ.20.50 కోట్లు అందిస్తారు. అలాగే, రన్నరప్ దక్షిణాఫ్రికాకు రూ.10.60 కోట్లు చెల్లిస్తారు. సెమీ ఫైనలిస్టులు ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ కు చెరో రూ.6.50 కోట్లు, సూపర్-8కు చేరిన 12 జట్లకు ఒక్కో టీంకు రూ.2 కోట్లు అందిస్తారు. 13 నుంచి 20వ స్థానంలోని ఒక్కో టీంకు రూ.1.90 కోట్లు, ప్రతి జట్టు విజయం సాధించిన మ్యాచ్ కు అదనంగా రూ.26 లక్షలు చెల్లిస్తారు.