India-Pakistan : భారత్-పాక్ మ్యాచ్ కు యాడ్స్ ధర ఎంతో తెలుసా?

India Vs Pakistan

India Vs Pakistan match

India-Pakistan : ఐసీసీ పురుషుల T20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. ఈ ఆదివారం భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచంలోని ఏ మూల ఉన్న క్రికెట్ అభిమాని అయినా ఎదురు చూడక తప్పదు. ప్రతీ సారి దీనిని బ్రాడ్ కాస్ట్ సంస్థలు సొమ్ముగా మలుచుకుంటాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 90 శాతానికి పైగా యాడ్స్ స్లాట్లు బుక్కయ్యాయి. కనెక్టెడ్ టీవీ, హెచ్‌డీ టీవీ స్లాట్లు దాదాపు అమ్ముడు పోయాయి. టీవీ, మొబైల్ యాడ్స్ కూడా బుక్ అయ్యాయి.

టీ20 అధికారిక బ్రాడ్ క్యాస్టర్లు అయిన డిస్నీ స్టార్, డిస్నీ+ హాట్ స్టార్ చాలా మ్యాచ్ లకు రేట్లను స్థిరంగా ఉంచాయి. కానీ భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కోసం ప్రకటన ఇవ్వాలనుకున్న వారు 20-25 శాతం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఈ ఎపిక్ క్లాష్ సందర్భంగా 10 సెకన్ల నిడివి గల యాడ్ ఖరీదు రూ.50 లక్షలు. సాధారణ మ్యాచ్ కంటే 22-25 శాతం ప్రీమియంతో భారత్-పాక్ మ్యాచ్ సాటిలేని రీచ్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కొన్ని బ్రాండ్లు కేవలం ఈ మ్యాచ్ కోసమే వెయిట్ చేస్తున్నాయి.

కవరేజీని బట్టి యాడ్స్ రేట్లు మారుతూ ఉంటాయి. హెచ్‌డీ, ఎస్‌డీ ఫీడ్ లకు కలిపి రూ.6.2 లక్షలు, ఎస్‌డీకి రూ.4.7 లక్షలు, హెచ్‌డీకి రూ.2.4 లక్షలు, అన్ని మ్యాచ్ లకు స్పాట్ కొనుగోళ్ల ధర రూ.6.40 లక్షలుగా నిర్ణయించారు. డిజిటల్ ప్లాట్ ఫాం డిస్నీ + హాట్ స్టార్ 3 స్పాన్సర్ షిప్ స్థాయిలను అందిస్తుంది. దీని ధర రూ .30 కోట్ల నుంచి రూ .80 కోట్ల వరకు ఉంటుంది. డ్రీమ్ 11, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బడా కంపెనీలతో సహా 19 మంది స్పాన్సర్లు ఇప్పటికే సంతకం చేశారు.

అమెరికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ జూన్ 2న ప్రారంభమైంది. జూన్ 9న పాకిస్తాన్ తో తలపడనున్న భారత్ తొలి మ్యాచ్ ఐర్లాండ్ తో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ మంచి విజయంసాధించింది. 

TAGS