JAISW News Telugu

Amitabh Bachchan : అయోధ్యలో అమితాబ్ కొన్న 20 ఎకరాల భూమి ధర ఎంతో తెలుసా..?

Amitabh Bachchan

Amitabh Bachchan

Amitabh Bachchan : దివ్య, భవ్యమైన రామ మందిరం నిర్మాణం తర్వాత ప్రపంచానికే ఆధ్యాత్మిక ప్రాంతంగా అయోధ్య మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాముడి జన్మస్థలం అయోధ్యలో ఆలయం కోసం 500 ఏళ్ల పాటు పోరాటం జరిగింది. సుప్రీం కోర్టు తీర్పుతో భారతీయుల కల సాకారమైంది. 2024, జనవరి 22న బాల రాముడి (రామ్ లల్లా)గా శ్రీరామచంద్రుడు కొలువయ్యాడు.

ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఎదిగే అవకాశం ఉన్న అయోధ్యలో లివింగ్ కాస్ట్ అమాంతం పెరిగింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని అలీబాగ్‌లో 20 ఎకరాల ల్యాండ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని విలువ రూ. 10 కోట్ల కంటే ఎక్కువ. దీని లావాదేవీలు గత వారంలో పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ భూమిని ‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL)’ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

అమితాబ్ అయోధ్యలోని అదే బిల్డర్ (హౌస్ ఆఫ్ అభినందన్ లోధా) నుంచి 7 స్టార్ మిక్స్‌డ్ యూజ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ‘ద సరయూ’లో 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భూమిని తీసుకున్నారు. దాని విలువ  రూ.14.5 కోట్లు.

అలీబాగ్‌లో ఆస్తులు కొన్న బాలీవుడ్ నటుల జాబితాలో షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ రూ. 9.5 కోట్ల విలువైన సాగు భూమిని కొనుగోలు చేసింది. షారూఖ్ కూడా థాల్‌లో సముద్రానికి ఎదురుగా కొంత ఆస్తిని తీసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే రియల్ ఎస్టేట్‌లో కూడా సెలబ్రిటీలు పెట్టుబడులు పెడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Exit mobile version