Producer Dil Raju : సంక్రాంతికి తెలుగు సినిమాలు విడుదల చేయడం ఆనవాయితీ. ఇందులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముందుంటారు. ప్రతి ఏడాదికి సంక్రాంతి బరిలో నిలవడం ఆయనకే చెల్లు. ఈ సంక్రాంతికి మహేష్ బాబుతో గుంటూరు కారం తో సంక్రాంతికి ముందుకొచ్చారు. కానీ ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో నైజాం ఏరియాలో థియేటర్లు దొరకకుండా చేశారు. ప్రముఖ సినిమా హనుమాన్ కు థియేటర్లు దొరకకుండా చేశారని టాక్.
దీనిపై మీడియా పలు విమర్శలు చేస్తూ కథనాలు రాశాయి. దీనిపై దిల్ రాజు కూడా స్పందించాడు. తనపై కావాలనే వ్యతిరేక వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా రెండు సినిమాలు తనను నష్టాల్లో పడేశాయని పేర్కొన్నారు. యూట్యూబ్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను నిర్మాతగా వ్యవహరించిన పెద్ద హీరోల సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసి ఎక్కువ నష్టపోయానని వెల్లడించారు.
తెలుగులో మహేష్ బాబు హీరోగా మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్, పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అజ్ణాతవాసి సినిమాలు నష్టాలు మిగిల్చాయి. స్పైడర్ సినిమాకు రూ. 12 కోట్లు, అజ్ణాతవాసి సినిమాకు రూ. 13 కోట్లు నష్టం కలిగించాయి. రెండు సినిమాల వల్ల రూ. 25 కోట్లు నష్టపోయానని చెప్పుకొచ్చారు.
ఇలా పెద్ద హీరోల వల్ల తనకు కలిగిన నష్టం భారీగానే ఉంది. కానీ ఇప్పుడు తనపై విమర్శలు చేస్తున్నారు. అప్పుడు తనకు కలిగిన నష్టానికి తాను ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇలా సినిమా పరిశ్రమలో ఇలాంటివి జరగడం మామూలే. అంతమాత్రాన తనపై బుదర జల్లుతూ కథనాలు రాయడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.