Jagan Meet KCR : జగన్ కేసీఆర్ ను పరామర్శించడంలో అంతరార్థం ఏమిటో తెలుసా?
Jagan meet KCR : కేసీఆర్, జగన్ ల మైత్రి అందరికి తెలిసిందే. వారు మంచి మిత్రులు. రాజకీయాల్లో వారి స్నేహం ఎప్పుడు కూడా చెడిపోలేదు. ఇద్దరిలో మంచి సమన్వయం ఉంటుంది. ఇద్దరి భావాలు, వ్యూహాలు ఒకేలా ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా వారిలో విరోధం రాలేదు. స్నేహపూరితంగానే ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్ జారిపడి తుంటి ఎముక విరగడంతో శస్త్ర చికిత్స తీసుకుని ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటారు. కేసీఆర్ ను ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం వచ్చి పరామర్శించి వెళ్లడం విశేషం.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కూడా కేసీఆర్ ను పరామర్శించారు. జగన్ రాగానే కేటీఆర్ బొకే అందజేసి ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. తరువాత కేసీఆర్ ను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. వీరి కలయికలో ఏదో అంతరార్థం దాగి ఉంటుందనే వాదనలు రాజకీయ విశ్లేషకులు తెస్తున్నారు. ఇద్దరు మామూలు నేతలు కాదు. వారి వ్యూహాలు వేరే ఉంటాయి. రాజకీయాల్లో తమ ఆలోచనలు మలుపు తిప్పేలా ఉంటాయనడంలో సందేహం లేదు.
మహానుభావులు ఊరకే రారు అన్నట్లు జగన్ పరామర్శలో రాజకీయ కోణం దాగి ఉంటుందని అనుమానిస్తున్నారు. సాటి నాయకుడిగా పరామర్శించడం సహజమే. కానీ వారి మదిలో ఎన్నో ఆలోచనలు మెరుస్తాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాగార్జున సాగర్ మీదకు ఏపీ అధికారులను పంపించి గొడవ చేయించడంలో ఇద్దరి పాత్ర ఉన్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు.
అటు తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడం ఇటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనే వాదనను తీసుకురావడానికి ఇద్దరు డ్రామా ఆడినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. వారి ఉద్దేశాలు, లక్ష్యాలు, ఆలోచనలు ఒకేలా ఉంటాయనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. జగన్ ఆదేశాల మేరకే అధికారులు వచ్చారని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేయడం తెలిసిందే. ఇలా సెంటిమెంట్ రగిలించడం, వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చి తమకు అనుకూలంగా మార్చుకోవడానికే ఇలా చేశారని అంతా అనుకున్నారు. ఇలా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయనడంలో సందేహం లేదు.