Sankranti Season : సంక్రాంతి సీజన్ ను ఉపయోగించుకుని హిట్టయిన చిత్రాలేవో తెలుసా?

Sankranti Season

Sankranti Season

Sankranti Season : మన తెలుగు సినిమాలకు ఓ సెంటిమెంట్ ఉంటుంది. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు అవి హిట్ కాకపోయినా యావరేజ్ రేంజ్ లో కొనసాగుతాయి. ఈ సెంటిమెంట్ తోనే సంక్రాంతి బరిలో నిలిపేందుకు పోటీ పడుతుంటారు నిర్మాతలు. ఇందులో భాగంగానే పలు సినిమాలు సంక్రాంతి పండగకు విడుదలై హిట్ సాధించడం గమనార్హం. వీటికి పబ్లిసిటీ అవసరం లేదు. పండగే వాటిని మంచి పొజిషన్ లో నిలబెడుతుంది.

కంటెంట్ లేని సినిమాలు కూడా పండగ రోజుల్లో ప్రచారం లేకపోయినా యావరేజ్ లో నిలవడం చూస్తుంటాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సంక్రాంతి  బరిలో నిలిచిన మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా గుంటూరు కారం నెగెటివ్ టాక్ వచ్చినా పండగ ప్రభావంతో యావరేజ్ గా నిలిచింది. ఇలా గతంలో కూడా పలు చిత్రాలు ఇలాగే నిలవడం గమనార్హం.

2017లో సంక్రాంతి బరిలో నిలిచిన శతమానం భవతి కూడా నెగెటివ్ టాక్ వచ్చినా తరువాత పుంజుకుని యావరేజ్ గా పేరు తెచ్చుకుంది. 2020లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కూడా ఇలాగే ప్రతికూల ప్రభావం పడినా తరువాత పుంజుకుంది.

శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఐ. ఇది కూడా సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలుత నెగెటివ్ టాక్ తెచ్చుకుని పండగ ప్రభావంతో యావరేజ్ గా నిలిచింది. ఎన్టీఆర్ 25వ సినిమాగా వచ్చిన నాన్నకు ప్రేమతో కూడా నెగెటివ్ గా పేరు తెచ్చుకున్నా తరువాత యావరేజ్ గా నిలిచి ఎన్టీఆర్ కు మంచి పేరు తీసుకొచ్చింది.

రాంచరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ కూడా సంక్రాంతి బరిలో యావరేజ్ గా మారింది. మహేష్ బాబు మరోసినిమా బిజినెస్ మేన్ కూడా మొదట ప్లాప్ గా అనుకున్నా తరువాత పుంజుకుంది. బాలక్రిష్ణ హీరోగా వచ్చిన జై సింహా కూడా మొదట నెగెటివ్ అనుకున్నా సంక్రాంతి పండగ కలిసి రావడంతో హిట్ గా మారిన విషయం తెలిసిందే.

TAGS