SS Rajamouli : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ఆస్తి ఎంతో తెలుసా?

SS Rajamouli

SS Rajamouli

SS Rajamouli : దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ లో ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అతను. అతను టాలీవుడ్ లో చేసిన సినిమా హాలీవుడ్ ను సైతం ఆలోచింప చేస్తుందంటే అతిశయోక్తి కాదు. బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన జక్కన్న ఆస్కార్ తో టాలీవుడ్ ఆకాశాన్ని తాకాడు.

బాహుబలి నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఆయన సినిమాలు చాలా ఫేమస్ అయ్యయి. ఇక ముందు కూడా అవుతూనే ఉంటాయి. అవకాశం ఉండాలే కానీ, మార్వెల్ తరహా సినిమాలు చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అడ్వెంచర్ ఫాంటసీ జానర్ సినిమాలతో అద్భుతాలు క్రియేట్ చేసిన దర్శకుడు ఆయన. అయితే, ఆయన ఇన్నేళ్ల కెరీర్ లో ఎంత సంపాదించుకున్నారు. నిక‌ర ఆస్తుల విలువ ఎంత? తెలుసుకుందాం.

రాజమౌళి నికర ఆస్తుల విలువ 158 కోట్లు (20 మిలియన్ డాల‌ర్లు) ఉంటుంద‌ని అంచ‌నా. కేవలం సినిమాలే కాకుండా మరిన్ని ఆదాయ వనరులు ఉన్నాయట. ప్రధాన ఆదాయ వనరుగా సినిమా ఉంటే మరికొన్ని వ్యాపారల్లో పెట్టుబడులు పెట్టారట. హైదరాబాద్ మ‌ణికొండ స‌మీపంలో లగ్జరీ బంగ్లా ఉంది. 2008లో ఈ ఇంటిని కొన్నరు జక్కన్న. హైదరాబాద్‌ లో ఉండే ఇంటితో పాటే ఔట‌ర్ లో ఫామ్ హౌస్, కొన్ని స్థలలు కూడా ఉన్నాయ‌ట. ఇతర నగరాల్లో కూడా అపార్ట్‌మెంట్లు, ఖ‌రీదైన కార్లు ఉన్నాయి. రేంజ్ రోవర్ – BMW సహా విలాసవంతమైన కార్లు అతడి సొంతం. వీటి ధర కోట్లలో ఉంటుంది.

హాలీవుడ్ సినిమా ఇండియానా జోన్స్ ను స్ఫూర్తిగా తీసుకొని భారీ అడ్వెంచర్ ప్లాన్ చేస్తున్నరు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ ఇవ్వగా. స్క్రిప్ట్ కూడా అయిపోయిందట. మహేశ్ బాబును ఎలాగో తీసుకున్నారు కాబట్టి ఇతర క్రూను తీసుకుంటున్నారు. కేవలం దర్శకుడిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా కొన్ని ప్రాజెక్టులకు రాజమౌళి ఫైనాన్సియల్ సపోర్ట్ చేస్తున్నారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రాజెక్ట్ లో కూడా రాజ‌మౌళి చేస్తున్నారు. భారతీయ సినిమా పితామహుడిగా గుర్తింపు దక్కించుకున్న ‘దాదాసాహెబ్ ఫాల్కే’ జీవితం  ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. రాజమౌళి తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు.

బాహుబలి ఫ్రాంచైజీకి రాజ‌మౌళి రూ. 25 కోట్లు తీసుకున్నాడని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఒక్కో ప్రాజెక్టుకు రూ.100 కోట్లకు రెమ్యునరేషన్ ను పెంచారు. మేడ్ ఇన్ ఇండియా, కల్కి 2898 ADలో గెస్ట్ రోల్ కూడా చేస్తున్నరని స‌మాచారం.

TAGS