Rajamouli : రాజమౌళికి మిగతా డైరెక్టర్లకు ఉన్న తేడా ఎంటోె తెలుసా..?
Rajamouli : తెలుగు సినిమాను పాన్ ఇండియా నుంచి ప్రపంచస్థాయికి తీసుకెళ్లి వరుసగా హిట్ లు కొడుతున్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలు సాధించడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు రాజమౌళి
లాగా హిట్ లు కొట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అవి సాధ్యపడటం లేదు.
రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, నితిన్, రవితేజ లాంటి హీరోలతో సినిమాలు చేసి హిట్ లు కొట్టాడు. చివరకు కమెడియన్ సునీల్ ను కూడా హీరోగా పరిచయం చేసి మర్యాద రామన్నతో తెలుగు ఇండస్ట్రీలోనే హిట్ సాధించాడు. ఇలా ప్రతి సినిమా ఒక విలక్షణ కథతో ముందుకు సాగుతుంది. ఒక ఇంటర్వెల్
సీన్ అత్యద్భుతంగా ఉంటుంది. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన నటుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజమౌళి అని చెప్పడంతో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
రాజమౌళి లాంటి దర్శకులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. ప్రతి అంశాన్ని ప్రేక్షకుడికి నచ్చేలా బలంగా కథను రాసుకుంటాడు. దాంతో పాటు మిగతా విషయాల్లో రాజమౌళి ఎలివేషన్స్ బాగా ఇస్తుంటాడు. అయితే ఎలివేషన్స్ విషయంలో మిగతా డైరెక్టర్లు పెద్దగా పట్టించుకోరు. లైట్ గా తీసుకుంటారు. దీంతో ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఫ్లాప్ ఎరుగని దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పాలి. ఇలాంటి సినిమాలు తీయాలంటే ఆయన వల్లే అవుతుంది. వేరే ఎవరి వల్ల సాధ్యం కాదనేలా ఆయన సినిమాల్లో చూపించే సీన్లు అన్ని సరికొత్తగా ఉంటున్నాయి. అందుకే ఆయన విజయం అనేది ఊరికే రావడం లేదు. ఎళ్లకు ఏళ్లు కష్టపడి సినిమా చేసి దాన్ని ఎలా ప్రమోషన్ చేయాలో తెలుసుకుంటున్నారు.
ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీని మహేశ్ బాబు తో రాజమౌళి డైరెక్షన్ చేస్తున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని ప్రపంచంలో కూడా తనకు తిరుగులేకుండా చేసుకోవాలని అనుకుంటున్నాడు. రాజమౌళి డైరెక్టర్ గా ఈ సారి పాన్ వరల్డ్ మూవీ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.