Ram Mandir : ప్రముఖ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపాదన గురించి అందరికి తెలిసిందే. అతడి సంపాదన రోజుకు దాదాపు రూ. 2 వేల కోట్లు ఉంటుంది. అతడి నికర ఆస్తి విలువ 100 మిలియన్ డాలర్లు దాటింది. దేశంలోనే అత్యంత సంపన్నుడుగా నిలుస్తున్నాడు. అతడు తలుచుకుంటే రోజుకో రామాలయం కట్టవచ్చు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అంబానీ సంపద 103 మిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనార్హం. భారతీయ కరెన్సీలో అతడి సంపద విలువ రూ.8,55,730 కోట్లు. దీన్ని ఒక్కో రోజుతో భాగిస్తే రోజువారీ ఆదాయం రూ. 2,345 కోట్లు.
అయోధ్యలో రామమందిరంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రాముడి ఆలయ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా? ముఖేష్ అంబానీ సంపద ఇంత భారీగా ఉండటంతో అతడు తలుచుకుంటే రోజుకో ఆలయం నిర్మించే సత్తా ఉంది. ముఖేష్ ఆదాయం విలువ ఇంత భారీగా ఉండటంతో రామమందిరం వంటి ఆలయాలు ఎన్నయినా నిర్మించొచ్చు.
రామమందిర నిర్మాణానికి రూ. 1800 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరుగుతోంది. ముఖేష్ అంబానీ తన సంపదతో రోజుకో ఇలాంటి రామ మందిరం నిర్మించినా ఏడాది చివరి నాటికి దాదాపు రూ.2 లక్షల కోట్ల ఆస్తులు మిగులుతాయి. అంత సంపద ముఖేష్ వద్ద ఉందని చెబుతున్నారు.
రామమందిరం ప్రారంభోత్సవానికి సుమారు ఏడు వేల మందికి ఆహ్వానం పంపారు. ఏర్పాట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మత గురువులు, సాధువులు, నాయకులు, నటులు, పారిశ్రామిక వేత్తలకు ఆహ్వాన లేఖలు పంపించారు. దీంతో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.