Benefits of Methi Leaves Winter : చలికాలంలో మెంతికూర చేసే మేలు ఎంతో తెలుసా?

Benefits of Methi Leaves Winter
Benefits of Methi Leaves Winter : మన ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో అవసరం. తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర వంటివి మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా కోతిమీర, మెంతి కూర కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈనేపథ్యంలో ఆకుకూరలు తినడం మన ఆరోగ్యానికి సురక్షితమే. మెంతికూరలో ప్రొటీన్లు మెండుగా ఉంటాయి. దీంతో మెంతిని తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
మెంతికూరలో కొవ్వులు, ప్రొటీన్లు, ఐరన్, కార్బోహైడ్రేడ్లు, కాల్షియం, సోడియం, మెగ్నిషియం, పొటాషియం, కాపర్, జింక్, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ,బి,సి, డి లు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో మనం తిన్న పదార్థాలు అంత తేలిగ్గా జీర్ణం కావు. అందుకే తేలిగ్గా అరిగే పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.
మన జీర్ణక్రియ సజావుగా సాగాలన్నా మెంతి కూర ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా కొవ్వును కరిగించే గుణం ఉంది. చెడు కొవ్వును కరిగించి మంచి కొవ్వును తయారయ్యేలా చేస్తుంది. పీచు కూడా అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి ఇనుమడిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెంతి కూర వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని తెలుసుకోవాలి.
మెంతి వల్ల మనకు చాలా లాభాలున్నాయి. మెంతిని పచ్చడిగా కూడా చేసుకోవచ్చు. రోజు వారీ ఆహారంలో మెంతిని భాగంగా చేసుకుంటే మనకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని పలువురు చెబుతున్నారు. డయాబెటిక్ ను అదుపులో ఉంచడంలో మెంతి ప్రధాన పాత్ర పోషిస్తుంది. మెంతి కూరను మనం చేసుకునే కూరల్లో వేసుకుంటే మంచి రుచి, వాసన వస్తాయి.