Naga Chaitanya : తెలుగులో నాగార్జున అక్కినేని, నాగచైతన్య కలిసి రెండు మూడు సినిమాలు నటించారు. మనం, బంగార్రాజు లాంటి హిట్ సినిమాల్లోతండ్రీ కొడుకులు కలిసి యాక్ట్ చేశారు. సోగ్గాడే చిన్నినాయనలో నాగార్జున ద్విపాత్రాభినయం చేశారు. నాగార్జున, రమ్యకృష్ణ కలిసి ఒక జంటగా నటించగా నాగార్జున, లావణ్య త్రిపాఠి మరో జంటగా యాక్ట్ చేసింది.
సోగ్గాడే చిన్నినాయన లో నాగార్జున చాలా చలాకైనా వ్యక్తిగా చురుగ్గా ఉంటాడు. కానీ తొందరగానే చనిపోతాడు. అయితే ఆ సినిమాలో నాగార్జున కొడుకుగా మళ్లీ నాగర్జునే రెండో రోల్ చేసి ఆకట్టుకున్నాడు. అమాయకపు పాత్రలో లావణ్య త్రిపాఠితో జరిగే సంభాషణలు సినిమాలో ఆకట్టుకుంటాయి. లావణ్య త్రిపాఠి కూడా ఈ సినిమాలో నాగార్జునతో నటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
సోగ్గాడే చిన్నినాయన సినిమాకు రెండో పార్టుగా బంగార్రాజు మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ సంక్రాంతి సమయంలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. బంగార్రాజు మూవీలో నాగచైతన్య నటించాడు. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. మొదటి సినిమాలో నాగార్జున రమ్యకృష్ణ కు మనుమడిగా నాగచైతన్య కనిపిస్తాడు.
రెండో క్యారెక్టర్ గా నాగార్జున, లావణ్య త్రిపాఠి నటించగా ఈ సినిమా ప్రకారం చూస్తే లావణ్య త్రిపాఠికి నాగచైతన్య కొడుకుగా యాక్ట్ చేసినట్టు చెప్పొచ్చు. లావణ్య త్రిపాఠితో నాగచైతన్య యుద్ధం శరణం గచ్చామి అనే మూవీలో నటించాడు. మనం సినిమాలో లావణ్య త్రిపాఠి నాగచైతన్యకు ఫ్రెండ్ గా యాక్ట్ చేసింది. ఇలా నాగచైతన్యతో లావణ్య త్రిపాఠి 3 క్యారెక్టర్స్ లలో నటించి మెప్పించింది. నాగచైతన్యకు తల్లిగా ఫ్రెండ్ గా హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటించడం విశేషం. ఇలాంటి అరుదైన సంయిఘటనలు కొంతమంది నటీనటుల మధ్యనే జరుగుతుంటాయి. అటు తండ్రితో హిరోయిన్ గా , ఇటు కొడుకుతో కూడా హిరోయిన్ గా యాక్ట్ చేసిన లావణ్య త్రిపాఠి ఎక్కడా కూడా తేడా తెలియకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంది.