Fake Switch off : ప్రస్తుత జనరేషన్ లో మనిషి జీవితంలో మొబైల్ ఒక భాగంగా మారింది. ఏవి మరిచిపోయినా పెద్దగా పట్టించకోని మనుషులు మొబైల్ మర్చిపోతే మాత్రం ఏదో కోల్పోయినట్లు భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ అనేది అంతగా పెనవేసుకుపోయింది. ఇండియాలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తోనే మనీ ట్రాన్జాక్షన్ (డిజిటల్ ట్రాన్జాక్షన్) ఎక్కువ కావడంతో బ్యాంకు డీటెయిల్స్ మొత్తం అందులోనే ఉంటున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రస్తుత జనరేషన్ కు ఫోన్ పోతే అన్నీ కోల్పోయినట్లే.
ఈ మధ్య మొబైల్ దొంగలు కూడా పెరిగిపోయారు. మొబైల్ స్నాచింగ్ లు ఎక్కువవుతున్నాయి. ఫోన్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇస్తాం. కంప్లయింట్ తీసుకున్న పోలీసులు గాలిస్తారు. దొంగ దొరికితే ఇస్తారు. లేదంటే ఫోన్ పై ఆశలు వదిలేసుకోవాల్సిందే. మరి ఫోన్ ను సొంతంగా ఎలా పట్టుకోవచ్చు. ఎక్కడ ఉంది? కొట్టేసిన వారు ఎవరు? ఎలా ఉంటారు? లాంటి విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఈ యాప్ లను వాడితే సరి.
సాధారణంగా దొంగలించిన వ్యక్తి ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేస్తాడు. కాబట్టి ఫోన్ లో ఫేక్ షట్ డౌన్ (Fake Shutdown) యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. దీని ద్వారా దొంగ స్విచ్ ఆఫ్ చేసినా కెమెరా.. లొకేషన్ ఆన్ లోనే ఉంటాయి. దీనికి సంబంధించిన వెబ్ సైట్ కు వెళ్లి ఆ వ్యక్తి, ఆ ప్రదేశం ఫొటోలు దొంగకు తెలియకుండా తీయవచ్చు. ఆ తర్వాత ఫోన్ ను పట్టుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
A post shared by Raj Photo Editing & Much More (@rajphotoeditingmuchmore)