Overseas Voters : ఓవర్సీస్ ఓటరుగా ఎలా నమోదు చేసుకోవాలో తెలుసా?

Overseas Voters

Overseas Voters

Overseas Voters : భారత్ లో ఎన్నికలు అంటే ఓ పెద్ద పండుగ అనే చెప్పాలి. దీన్నే ఓట్ల పండుగ అని కూడా జనాలు అంటుంటారు. మారుమూల గ్రామాల్లో నివసించే నిరక్షరాస్యులు సైతం తమ ఓటును కచ్చితంగా వినియోగించుకుంటారు. నగరాల్లో కంటే పల్లెల్లోనే ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని చూస్తుంటాం. అలాంటి ఓట్ల పండుగలో ప్రవాసులు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చా అనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది.  నిరభ్యంతరంగా ఓటు వేయవచ్చని ఎన్నికల సంఘం చెపుతోంది. అయితే ఇందుకు కొన్ని రూల్స్ ఉంటాయని.. అవి పాటిస్తే చాలని అంటోంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం..ఉపాధి, విద్య మొదలైన కారణాల వల్ల విదేశాల్లో ఉండి.. మరే ఇతర దేశ పౌరసత్వం పొందని భారత పౌరుడిని ఓవర్సీస్ ఓటర్లు అంటారు. వారు వారి భారతీయ పాస్ పోర్ట్ లో పేర్కొన్న చిరునామాలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.

ఎన్నారైలు ఓటు హక్కు పొందాలంటే..

– పాస్ పోర్టు ప్రకారం ఎన్ ఆర్ ఐ ఇల్లు ఉన్న నియోజకవర్గంలోని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి దరఖాస్తు దారు సూచించి ఫామ్ 6 ఏ లో దరఖాస్తు దాఖలు చేయాలి. ఆన్ లైన్ లో కూడా ఈ ఫామ్ ను పూరించవచ్చు. లేదా ఈసీఐ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

– ఫామ్ 6 ఏ రీసెంట్ పాస్ పోర్ట్ సైజు కలర్ ఫొటో ఒకటి జత చేయాలి. భారతీయ చిరునామా ఉన్న పాస్ పోర్ట్ పేజీల స్వీయ ధ్రువీకరణ ఫొటోకాపీలు, చెల్లుబాటు అయ్యే వీసా ఎండార్స్ మెంట్ ఉన్న పాస్ పోర్ట్ పేజీని దరఖాస్తుదారు సమర్పించాలి.

– దరఖాస్తుదారు ఈ పత్రాలను వ్యక్తిగతంగా సమర్పించవచ్చు. లేదా కార్యాలయానికి పోస్ట్ ద్వారా పంపవచ్చు. పత్రాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి లేదా ఈసీఐ వెబ్ సైట్ లో కూడా ఫైల్ చేయవచ్చు.

– ఒక వ్యక్తి దరఖాస్తును పోస్ట్ ద్వారా పంపినట్లయితే.. అతడు లేదా ఆమె తప్పనిసరిగా ప్రతీ ఫొటో కాపీని ధ్రువీకరించాలి. వ్యక్తిగతంగా దరఖాస్తును సమర్పించాలని నిర్ణయించుకుంటే.. అతడు లేదా ఆమె తప్పనిసరిగా ధ్రువీకరణ కోసం అసలు పాస్ పోర్ట్ ను చూపించాలి.

– ఈసీఐ వెబ్ సైట్ లేదా ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్ సైట్ లో ఎలక్ట్రోరల్ జిల్లా అధికారి చిరునామాను కనుగొనవచ్చు.

– అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత ఎన్నారై దరఖాస్తు గురించి నిర్ణయం తీసుకోబడుతుంది. ఈఆర్వో నిర్ణయం దరఖాస్తుదారు చిరునామాపై పోస్ట్ ద్వారా తెలియజేయబడుతుంది. ఫామ్ 6 ఏలో ఇవ్వబడిన మొబైల్ నంబర్ కు మెసేజ్ పంపబడుతుంది. ఎలక్ట్రోరల్ రోల్స్ కూడా చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వెబ్ సైట్ లో ఉన్నాయి.

– అయితే ఎలక్ట్రోరల్ రోల్ లో ఏదైనా దిద్దుబాటు కోసం దరఖాస్తు దారులు ఫామ్-8ని ఉపయోగించవచ్చు.

– విదేశాల్లో ఉండే ఓటర్ కు ఎపిక్ కార్డు జారీ చేయబడదు. వారు అసలు పాస్ పోర్ట్ ను చూపించిన తర్వాత పోలింగ్ స్టేషన్ లో వ్యక్తిగతంగా ఓటు వేయడానికి అనుమతించబడుతారు.

ఇవి గుర్తించుకోవాలి..

– ఎవరూ ఒకటి కంటే ఎక్కువ ఓటర్ల జాబితాలో నమోదు చేయబడలేరు. అంటే మీరు ఎన్నారై ఓటరుగా నమోదు చేసుకున్నప్పుడు.. దరఖాస్తుదారు సాధారణ ఓటర్ గా నమోదు చేసుకోలేదనే ఒక డిక్లరేషన్ సమర్పించాలి.

– దరఖాస్తుదారు అప్పటికే సాధారణ ఓటర్ గా నమోదు చేసుకున్నట్లయితే ఫామ్ 6 ఏ సమర్పణతో పాటు మీ ఎపిక్ ను సరెండర్ చేయాలి.

– ఎన్నారైలు భారత్ కు తిరిగి వచ్చినప్పుడు.. వారు సాధారణ నివాస స్థలంలో సాధారణ ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు.

TAGS