Head Bath : రోజు తల స్నానం చేస్తే ఎన్ని నష్టాలో తెలుసా?
Head Bath : ప్రతి మనిషి రోజు స్నానం చేస్తుంటాడు. చాలా మంది రెగ్యులర్ గా తలస్నానం చేస్తుంటారు. తల స్నానం చేయడం వల్ల వెంట్రుకలు సహజ కాంతిని కోల్పోతాయి. డల్ గా కనిపిస్తాయి. జీవకళ పోయినట్లుగా కనిపిస్తాయి. తరచూ తలస్నానం చేయడం వల్ల తలలోని నేచురల్ ఆయిల్స్ తగ్గుతాయి. కుదుళ్లు పొడిబారతాయి. వెంట్రుకలు పొడిగా మారుతాయి.
రోజు తలస్నానం చేయడం వల్ల తల పొడిబారిపోతుంది. వెంట్రుకలకు ఆయిల్ అందక డ్రైగా మారతాయి. వెంట్రుకలు డ్యామేజ్ అవుతాయి. తలస్నానం చేయడం వల్ల జుట్టు కాంతి కోల్పోతుంది. రంగు మారుతుంది. కలర్ పెయిడ్ అయినట్లు అనిపిస్తుంది. గ్రే హెయిర్ వస్తుంది. తలస్నానం చేయడం వల్ల కుదుళ్లలో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
ఇంకా హెయిర్ డ్యామేజ్ పెరుగుతుంది. జుట్టు రాలడం జరుగుతుంది. తలలో ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోతుంది. చుండ్రు సమస్య పెరుగుతుంది. షాంపు చేయడం వల్ల సమస్య తగ్గుతుంది. రోజు షాంపు చేయడం అంత మంచిది కాదు. వారానికి రెండు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు జుట్టుకు నూనెతో మర్దన చేయాలి.
ఇలా చేస్తే మీ జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా ఉంటుంది. తలస్నానం వల్ల మనకు జరిగే అనర్థాలు తెలిశాయి కాబట్టి మన ఆరోగ్యం కోసం రోజు మనం తలస్నానం చేయడం సురక్షితం కాదు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తలస్నానం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే మన వెంట్రుకలకు నష్టం కలుగుతుందని తెలుసుకోవడం మంచిది.