NTR : ఎన్టీఆర్ తాగిన వాటర్ బాటిల్ ఖరీదు ఎంత తెలుసా?
NTR : మ్యాడ్ స్క్వైర్ ఈవెంట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ధరించిన దుస్తులే కాకుండా, స్టేజీ మీద రాకముందు తాగిన డ్రింక్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గ్రీన్ బాటిల్‌లో ఉన్న ఆ డ్రింక్‌ను ఎన్టీఆర్ తాగిన దృశ్యం ఈవెంట్‌లో చూసిన అభిమానులు, ఇది ఏదీ?, ఎంత ఖరీదు?, ఎక్కడ దొరుకుతుంది? అనే ప్రశ్నలతో ఇంటర్నెట్‌ని గాలిస్తున్నారు.
ఈ గ్రీన్ బాటిల్‌లో ఉన్నది సాధారణమైన నీరు కాదు. ఇది పెరియల్ కంపెనీకి చెందిన కార్బోనేటెడ్ మినరల్ వాటర్. ఈ నీరు సోడా టేస్ట్‌తో ఉండే విధంగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదిగా భావించే ఈ డ్రింక్ 300 మిల్లీ లీటర్ల బాటిల్లో లభిస్తుంది. దీని ధర సుమారుగా ₹145 నుంచి ప్రారంభమవుతుంది.
ఇలాంటి డ్రింక్స్ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిచ్చే సినీ సెలబ్రిటీలకు ఎంతో ఇష్టమైనవి. షూటింగ్‌ల సమయంలో ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఈ తరహా వాటర్‌ను ఎక్కువగా తీసుకుంటూ ఉండటం ఇదే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఎన్టీఆర్ తాగిన బాటిల్ గురించి వచ్చిన ఈ చర్చ, అందులో ఉన్న డ్రింక్‌ను ఫ్యాన్స్ మధ్య మరింత పాపులర్ చేసింది.