Ram Charan : రామ్ చరణ్ మొదటి సినిమా కు ఎంత తీసుకున్నాడో తెలుసా..
Ram Charan : రామ్ చరణ్ తేజ్ చిరంజీవి కొడుకుగా సినిమాల్లో చిరుత మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ ను ఇంట్రడ్యూస్ చేసేందుకు చిరంజీవి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. రామ్ చరణ్ కు హీరోగా సరైన ప్లాట్ ఫాం ఇచ్చేందుకు ఆయన అప్పటి స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను ఎంచుకున్నాడు. పూరీ జగన్నాథ్ కు రామ్ చరణ్ తేజ్ ను అప్పగిస్తున్నట్లు ఓ సభా వేదికలోనే చిరంజీవి చెప్పారు.
అయితే చిరుత మూవీలో రామ్ చరణ్ ఎంట్రీ సూపర్ గా ఉంటుంది. రామ్ చరణ్ ను ఎలాంటి ఎంట్రీ ఇవ్వాలో దానికి మించి ఇచ్చేశాడు పూరీ. ఈ మూవీ ద్వారా రామ్ చరణ్ మంచి డ్యాన్సర్, నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి చేతిలో పడటం, మగధీర సినిమాలో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు రామ్ చరణ్.
ఈ విధంగా తనెంటో నిరూపించుకుని ప్రస్తుతం పెద్ద సినిమా హీరోగా ఇండస్ట్రీలో నిలిచిపోయాడు. చిరంజీవి వారసుడిగా తన పేరు నిలబెట్టుకుంటున్నాడు. అయితే రామ్ చరణ్ చిరుత మూవీకి సంబంధించి తీసుకున్న రెమ్యూనరేషన్ పై తెగ చర్చ సాగుతోంది. మొదటి సినిమాకు రామ్ చరణ్ ఎన్ని డబ్బులు తీసుకున్నాడు. తన రెమ్యూనరేషన్ ఎంత అనే దానిపై ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
చిరుత సినిమాకు అశ్విని దత్ ప్రొడ్యూసర్. రామ్ చరణ్ ను ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వాలని అడిగితే చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడంటా.. ఇదే విషయంపై చిరంజీవిని అశ్వినిదత్ అడిగితే మీరు ఎంత కావాలంటే అంత ఇవ్వండి మీ ఇష్టం అని అన్నారని దీంతో అశ్విని దత్ రామ్ చరణ్ కు మొదటి సినిమాలోనే ఏకంగా రూ. 50 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి సినిమాలోనే రూ. 50 లక్షలు తీసుకోవడం చాలా గ్రేట్ అని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.