JAISW News Telugu

Hardik Pandya : హార్థిక్ పాండ్యా భరణం కింద ఎంత పెద్ద మొత్తం చెల్లించబోతున్నాడో తెలుసా?

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya : టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా కొన్ని రోజులుగా అతడి పర్సనల్ లైఫ్ గురించి వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్‌కు విభేదాలు తలెత్తాయని.. వారు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం సాగుతోంది. నటాషా తన సోషల్‌ మీడియా ఖాతాల్లో తన పేరు పక్కన వచ్చే పాండ్యా ఇంటిపేరును తొలగించారని దీని ద్వారా విడిపోయినట్లు పరోక్షంగా చెప్తుందని ‘రెడిట్’‌ పోస్ట్‌ ద్వారా నెటిజన్లు అంచనాకు వచ్చారు. ఇటీవల జరిగిన ఐపీఎల్-2024కు నటాషా రాలేదని, కనీసం అతనితో కలిసి ఉన్న ఫొటోలను కూడా పోస్ట్ చేయలేదని, ఇందుకు కారణాలు వెతికే ప్రయత్నం చేశారు.

వదంతులు మాత్రమే..!
ఇవన్నీ పుకార్లేనని హార్దిక్‌ అభిమానులు కొట్టిపారేస్తున్నారు. MI కొత్త కెప్టెన్‌‌గా నియమితుడైన హార్దిక్‌ పాండ్యా విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యాడు. 14లో కేవలం నాలుగు మాత్రమే గెలిచి 10 ఓటిమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయాడు. దీంతో అతడిపై విమర్శలు పదునెక్కాయి. ఈ ప్రభావం ఆయన భార్య, కుమారుడిపై పడకుండా ఉండాలనే పాండ్యానే తనతో ఉన్న ఫొటోలు పోస్ట్‌ చేయద్దని భార్యకు సూచించినట్లు తెలుస్తోంది.

ఇన్నాళ్లూ విభేదాలని వార్తలు రాగా.. గాసిప్‌ రాయుళ్లు మరో ముందుడుగు వేశారు. హార్దిక్‌ పాండ్యా తీరు నచ్చని నటాషా.. విడాకుల కోసం దరఖాస్తు చేసిందని వదంతులు వ్యాప్తి చేస్తున్నారు.

భరణం కింద ఆస్తిలో 70 శాతం!
ఈ క్రమంలో భరణం కింద హార్దిక్‌ ఆస్తి (స్పోర్ట్స్‌ క్రీడా నివేదిక ప్రకారం.. సుమారు రూ. 91 కోట్లు)లో 70 శాతం మేర (దాదాపు రూ. 63 కోట్లు) ఇవ్వాలని కోరిండట.. ఇందుకు అతడు సుముఖంగానే ఉన్నట్లు రూమర్లు క్రియేట్ చేశారు. ఈ విషయంపై హార్దిక్‌ గానీ.. నటాషా గానీ పెదవి విప్పకపోవడం వారి రూమర్లకు ఊతం వచ్చినట్లయ్యింది.

ఇటీవల నటాషా నుదిటిపై బొట్టుతో ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేస్తూ.. క్యాప్షన్ గా ‘అతడి ప్రేమ వల్లే ఇలా’ అంటూ జత చేసింది. దీంతో పాండ్యాను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్‌ చేసిందని అభిమానులు భావిస్తున్నారు.

హార్దిక్‌, సెర్బియా మోడల్‌ నటాషాను 2020లో పెళ్లాడాడు. లవ్ చేసుకున్న వీరు పెళ్లికి ముందే  తల్లిదండ్రులయ్యారు. ఇవన్నీ పక్కన పెడితే.. హార్దిక్‌ పాండ్యా జూన్‌ 1 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్ కప్-2024కు సిద్ధం కానున్నాడు.

Exit mobile version