Aurangzeb : ఔరంగజేబుకు ఎంత మంది భార్యలు ఉన్నారో తెలుసా?

Aurangzeb

Aurangzeb

Aurangzeb : చిన్నప్పుడు చరిత్ర పుస్తకాల్లో మొఘల్ రాజుల గురించి చదువుకున్నాం. అందులో అత్యంత క్రూరుడిగా ఔరంగజేబు గురించి చదువుకున్నాం. పరమత సహనం లేనివాడని, హిందువులను నానా ఇబ్బందులకు గురిచేశాడని, జిజియా పన్ను విధించాడని చదువుకున్నాం. ఎన్నో హిందు ఆలయాలను కూల్చేశాడని, రాజ్యకాంక్షతో సొంత తండ్రిని కూడా చంపాడని కూడా చదువుకున్నాం.  అయితే అతడి వ్యక్తిగత జీవితం గురించి మన పుస్తకాల్లో పెద్దగా లేదు. అందుకే అతడి వ్యక్తిగత జీవితం గురించి అందరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇందులో భాగంగానే ఆయనకు ఎంత మంది భార్యలు ఉన్నారు..వారి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం..

ఔరంగజేబు 1618 సంవత్సరంలో దాహోద్ (ప్రస్తుత గుజరాత్)లో జన్మించాడు. షాజహాన్, ముంతాజ్ మహల్ కు మూడో కుమారుడు. ఔరంగజేబు మాత్రం తానే రాజు అయ్యేందు తన సోదరులందరినీ ఓడించి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అవుతాడు. భారత దేశంలోనే అత్యంత క్రూర రాజుగా ముద్ర వేసుకున్న ఔరంగజేబు 1707లో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో మరణిస్తాడు. ఆయన మతదేహాన్ని ఖుల్తాబాద్ కు తరలించారు.

కాగా, ఔరంగజేబుకు ముగ్గురు భార్యలు ఉండేవారు.  మొదటి భార్య దిల్రాస్ బానో బేగం. 1637లో వీరి వివాహం జరిగింది. రెండో భార్య నవాబ్ భాయి, ఒక హిందూ యువరాణి. అతడు రాజకీయ సౌలభ్యం కోసం1638లో ఆమెను వివాహం చేసుకుంటాడు. ఇక మూడో భార్య జార్జియా లేదా సర్కస్. కొందరు ఈమెను ఉంపుడుగత్తె అని కూడా అంటారు. ఔరంగజేబుకు ఐదుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఔరంగజేబును క్రూరుడిగా చెప్పుకున్న గొప్ప దైవభక్తుడు అని మాత్రం చెప్పవచ్చు. మతాచారాలను తప్పకుండా పాటించేవాడు. భారత దేశానికి తాను చక్రవర్తి అయిన తన స్వంత ఖర్చులు (తిండి, బట్టలు సైతం) కేవలం తాను టోపిలు కుట్టి సంపాదించిన డబ్బులతోనే పెట్టేవాడని చెప్పుకుంటారు. అతని మత విశ్వాసాల ప్రకారం ముస్లింలు కానివారిపై జిజియా పన్ను విధించాడు.  హిందువులను హింసించాడు.

అయితే ఇతనిలో మరో కోణం కూడా ఉంది. అలహాబాద్ లోని సోమేశ్వరనాథ్ ఆలయానికి స్థలాన్ని, ఉజ్జయిని, చిత్రకూట బాలాజీ, గౌహతీ ఉమానంద్ ఆలయాలకు నిధులు కూడా ఇచ్చాడు. గోల్కొండ లోని జామా మసీదును పడగొట్టి దాని కింద ఉన్న నిధులను వెలికితీయించి ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించడం గమనార్హం.

TAGS