how many times : రెండు మనసుల ఇష్టపూర్వక కలయికే శృంగారం. అయితే ఈ శృంగారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నెలకోసారి సెక్స్ లో పాల్గొనే వారి కంటే వారానికి రెండు, మూడు సార్లు పాల్గొని వారికి గుండెపోటు వచ్చే అవకాశం అతి తక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. శృంగారంతో శారీరక శ్రమ మాత్రమే కాకుండా భార్యాభర్తల మధ్య బంధం బలోపేతమవుతుంది. మనసుకు ఎంతో సంతృప్తినిస్తుంది. చాలా మందికి సెక్స్ అనే మాట ఎత్తితేనే ఏదోలా అవుతుంటారు. అదేదో పెద్ద తప్పులా బయటకు మాట్లడవద్దు అంటూ సిగ్గు పడుతుంటారు. చాలా వరకు వ్యాధుల కట్టడికి శృంగారంఅనేది దోహదం చేస్తుంది.
అమెరికాకు చెందిన జర్నల్ ఆఫ్ కార్డియాలజీ 2015 జనవరిలో ఒక కథనం ప్రచురించింది. ఈ కథనంలో పేర్కొన్న అధ్యయనం ప్రకారం వారానికి రెండు కంటే ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనేవారికి హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువగా తెలిపారు. అదే విధంగా రక్తపోటును తగ్గిస్తుంది. శృంగారం ఎండార్ఫిన్లు, ఇతర మూడ్ బూస్టింగ్ హార్మోన్లు పెంచడం ద్వారా ఒత్తిడిని సాధ్యమైనంత మేర తగ్గిస్తుంది. దీంతో పాటు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. 2016లో యూరోపియన్ యూరాలజీ జర్నల్ ఈ మేరకు పేర్కొంది. ఎక్కువ రోజులు సెక్స్ లో పాల్గొనేవారికి 20 శాతం తక్కువ ప్రమాదం ఉంటుందని చెప్పారు.
ఇక నిద్ర, విశ్రాంతి కి ఇదే మేలు చేస్తుంది. సంతృప్తికరమైన సెక్స్ అనంతరం తీసే నిద్ర మనసు కు ఎంతో ప్రశాంతతను అందిస్తుంది. ఉదయం ఉత్సాహానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఇక శృంగారం ప్రతి మనిషిలో యవ్వనపు చాయలను కలిగిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మనసుకు తగిలిన ఒత్తిడిని తగ్గించుకునేందుకు శృంగారానికి మించిన ఔషధం లేదని వైద్య, మానసిక నిపుణులు చెబుతుంటారు. ఎంజాయ్ మెంట్ కోసమే కాకుండా మెంటల్ రిలీఫ్ కోసం సెక్స్ అనేది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.