Virat 10th Class : విరాట్ పదో తరగతి మార్క్ షీట్ ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?
Virat 10th Class Mark Sheet : విరాట్ కొహ్లి అనగానే ఇండియాలో తెలియని వారుండరూ.. అయితే విరాట్ కొహ్లి పదో తరగతి మార్కుల షీట్ ను మీరెప్పుడైనా చూశారా.. చదువులో విరాట్ ఎలా ఉండేవాడో అందరూ తెలుసుకోవాలని అనుకుంటుండగా.. విరాట్ తన ట్విటర్ అకౌంట్ లో పదో తరగతి మార్కుల షీట్ ను అప్ డేట్ చేశాడు.
విరాట్ కొహ్లీకి మ్యాథ్య్ అంటే పెద్ద ఇష్టం లేదని తెలుస్తోంది. కొహ్లికీ ఇంగ్లీష్ లో 83, మ్యాథ్య్ లో 51, సైన్స్ లో 55 మార్కులు రాగా.. ఇన్పర్మేషన్ టెక్నాలజీలో 74 మార్కులు వచ్చాయి. అయితే మార్కుల లిస్టు లో ప్రాధాన్యం ఇవ్వని విషయాలు మీ జీవితంలో మీ క్యారెక్టర్ ను బిల్డ్ చేయడం కోసం ఎంతో ప్రయత్నిస్తాయి. ఇది చాలా ఫన్నీగా ఉంది అంటూ పోస్టు చేశాడు. అయితే వెంటనే దాన్నిడిలేట్ చేశాడు. కానీ ఈ ఫొటో అప్పటికే వైరల్ గా మారిపోయింది.
గొప్ప క్రికెటర్ అయిన విరాట్ కొహ్లీ చదివింది మాత్రం 12 వ తరగతి అని గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ తర్వాత మొత్తం క్రికెట్ కే తన జీవితాన్ని దారపోశాడు. విరాట్ కొహ్లీ అండర్ – 19 జట్టు తరఫున ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అండర్ 19 వరల్డ్ కప్ గెలిచి తనెంటో నిరూపించుకున్నాడు. విరాట్ కొహ్లి వెంటనే టీం ఇండియా తలుపు తట్టాడు.
ఈ పరుగుల యంత్రం, రన్ మెషీన్ ఇలా ఎన్నో ముద్దు పేర్లతో పిలుచుకునే విరాట్ కొహ్లీ అంటే ఇప్పుడు అందరికీ సుపరిచితమే అయినా అతడు తన చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డాడు. విరాట్ కొహ్లీ కి చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలని కోరిక ఉండేది. విరాట్ తన కోరికను నెరవేర్చుకునే సమయంలోనే చిన్న వయసులోనే ఆయన తండ్రి మరణించాడు. తండ్రి మరణించిన రోజు కూడా మ్యాచ్ ఆడి ముగించి ఆయన అంత్యక్రియలకు వెళ్లాడంటే ఎంత డెడికేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు.