JAISW News Telugu

Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు ఎన్ని గంటలు కష్టపడుతున్నారో తెలుసా?

Minister Sridhar Babu 

IT Minister Sridhar Babu 

IT Minister Sridhar Babu  : రాజకీయ నేతలకు సినిమా వాళ్లకు దగ్గరి సంబంధాలు ఉంటాయి. సినిమా వాళ్లు రాజకీయాలు చేసి సీఎంలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో రెండు రంగాలు ఒకదానికి మరొకటి పెనవేసుకుని ఉండటం సహజమే. వారి అవసరం వీరికి వీరి అవసరం వారికి ఉంటుంది. దీంతో వారి పనులు చేయించుకునేందుకు వారు కలిసి ఉంటారు. అది వారికి అవసరమే.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖలకు మంత్రిగా ఉన్నారు. తన శాఖల పనితీరు మెరుగుపరచేందుకు దాదాపు 20 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. ఉద్యోగులను సమర్థవంతంగా పనిచేయించేందుకు తను కూడా వారితోనే ఉంటున్నారు. అలా పనులకు ఆటంకం కలగకుండా చేయడానికి నిర్విరామంగా పాటుపడుతున్నారు.

రోజుకు ఇరవై గంటలు పనిచేస్తూ నాలుగు గంటలే విశ్రాంతి తీసుకుంటున్నారు. తనను కలవడానికి ఎవరు వచ్చినా కాదనకుండా చిరునవ్వుతో కలుస్తున్నారు. వారి సమస్యలు వింటున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ మంత్రులు ప్రజలను కలిసే వారు కాదు. దీంతో ఎవరు కూడా వారిని కలిసేందుకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. కాంగ్రెస్ మంత్రులు ప్రజాసమస్యలు పరిష్కరించడంలో ప్రాధాన్యం ఇస్తున్నారు.

దీనిపై సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. శ్రీధర్ బాబు పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టపడి పనిచేస్తున్నారని కితాబిస్తున్నారు. తాను ఇంతవరకు ఇలాంటి మంత్రిని చూడలేదని చెబుతున్నారు. శ్రీధర్ బాబు ప్రజలతో కలిసేందుకు ఇష్టపడుతున్నారు. వారి సమస్యల పరిష్కారంలో ముందుంటున్నారని గణేష్ పొగుడుతున్నారు.

Exit mobile version