Allu Arjun Charge For Ad : అల్లు అర్జున్ ఒక్కో యాడ్ కోసం ఎన్ని కోట్లు ఛార్జ్ చేస్తున్నాడో తెలుసా..?

Allu Arjun Charge For Ad

Allu Arjun Charge For Ad

Allu Arjun Charge For Ad : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈ పేరునే ఇప్పుడు పెద్ద బ్రాండ్ అనే చెప్పాలి.. ఒకప్పుడు కేవలం తెలుగు భాషలకు మాత్రమే స్టైలిస్ట్ స్టార్ గా పాపులర్ అయ్యాడు.. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఫేమస్ అవ్వడంతో ఐకాన్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. ఒకే ఒక్క సినిమా ఈయన లైఫ్ ను పూర్తిగా టర్న్ చేసింది.

సుకుమార్ దర్శకత్వంలో చేసిన పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు. పుష్పరాజ్ గా ఈయన ఖ్యాతి ప్రపంచ నలుమూలలా వ్యాపించింది. ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకుని ఇమేజ్ డబల్ చేసుకున్నాడు.. దీంతో ఐకాన్ స్టార్ బ్రాండ్ వాల్యూ కూడా బాగా పెరిగింది అనే చెప్పాలి..

ఇప్పటికే దేశంలో ఎక్కువ బ్రాండ్ వాల్యూ ఉన్న టాప్ 25 లిస్టులో ఐకాన్ స్టార్ కూడా స్థానం సంపాదించు కున్నాడు.. అల్లు అర్జున్ ప్రస్తుతం చాలా బ్రాండ్ లకు అంబాసిడర్ గా ఉన్నారు.. అల్లు అర్జున్ క్రేజ్ భారీగా పెరగడంతో ఈయన క్రేజ్ వాడుకుని తమ బ్రాండ్ లను పాపులర్ చేసుకునేందుకు ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయి.

ప్రస్తుతం కోకోకోలా, ఆస్ట్రల్, జొమోటో, రెడ్ బస్, కేఎఫ్సి వంటి బ్రాండ్ లకు ఈయన అంబాసిడర్ గా ఉండగా భారీగా వసూళ్లు చేస్తున్నాడు అని నెట్టింట రూమర్స్ వస్తున్నాయి.. ఒకప్పుడు ఒక్కో యాడ్ షూట్ కోసం 60 లక్షలు వసూలు చేసే అల్లు అర్జున్ ఇప్పుడు ఏకంగా 6 కోట్లు పుచ్చుకుంటున్నాడు అని టాక్..

పుష్పరాజ్ రేంజ్ నేషనల్ అవార్డుతో మరింత పెరిగింది అని అందుకే ఈయన బ్రాండ్ వాల్యూ కూడా అమాంతం పెరిగింది అని అంటున్నారు. ఈ రేంజ్ లో మన టాలీవుడ్ లో మరే హీరోకు కూడా అమాంతం బ్రాండ్ వాల్యూ పెరగలేదు అనే చెప్పాలి. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాకు సీక్వెల్ చేస్తుండగా ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ కాబోతుంది.. మరి ఇది కూడా రిలీజ్ అయితే పరిస్థితి మరో రకంగా మారే అవకాశం కూడా లేకపోలేదు..

TAGS