Apple : ఒక్క యాపిల్ లో ఎన్ని బ్యాక్టీరియాల్ ఉంటాయో తెలుసా?
Apple : చాలామందికి ఫ్రూట్స్ తినడం అలవాటు ఉంటుంది. కానీ వాటి ధర ఎక్కువగా ఉండటంతో పరిమితంగా తింటూ ఉంటారు. ఎక్కువగా అరటి పండ్లు, ఆపిల్స్, దానిమ్మ, నారింజ పండ్లను తినడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఆస్ట్రియాలోని ఒక యూనివర్సిటీలో చేపట్టిన పరిశోధనలు కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
రోజు ఒక ఆపిల్ లేదా ఒక్క ఆపిల్ తింటే మాత్రం మన కడుపులోకి దాదాపు పదివేల బ్యాక్టీరియాలు వెళ్తాయని వారి పరిశోధనలో తేలింది. భయపడుతున్నారా అసలు విషయం ఏంటంటే అవన్నీ మంచి బ్యాక్టీరియా లేనంట. ఒక యాపిల్ తినడం ద్వారా మంచి బ్యాక్టీరియాలు పదివేలు మన కడుపులోకి ఇచ్చేది మన ఆరోగ్యానికి మంచి చేస్తుందని వారి పరిశోధనలో తేలింది.
తద్వారా యాపిల్ గురించి మంచి విషయం బయటకు వచ్చింది. అయితే యాపిల్ లోని గుజ్జు విత్తులు, కాండం, గుజ్జు ఇలా అన్ని విషయాల్లో ఎక్కువగా పోషకాలతో పాటు బ్యాక్టీరియాలను కూడా ఉంటాయని తెలిపింది. 240 గ్రాములు న ఒక ఆపిల్లో 10 కోట్ల బ్యాక్టీరియాలో ఉన్నట్టు ఆస్ట్రియాలోని గ్రాస్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. అయితే పంట పండే ప్రాంతం పండించే విధానాన్ని బట్టి కూడా ఆయా ఆపిల్స్ లలో ఎక్కువగా మార్పులు జరుగుతుంటాయని తెలిపింది. బయో ఫార్ములా పొజిషన్ మారడం వల్ల ఆపిల్ రంగు రుచిలో మార్పు కూడా వస్తుందని ఈ పరిశోధనలో వెల్లడైంది.
మొత్తం మీద ఒక పండు తినడం వలన కలిగే లాభాలను సరికొత్త విషయాలను ఈ యూనివర్సిటీ వెల్లడించింది. ఇలా ఆపిల్స్ తినడం ప్రారంభిస్తే కడుపులో ఉండే అనేక సమస్యలు తీరే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటినుంచి ఆపిల్స్ తినడం ప్రారంభిస్తే మేలు అని ఈ పరిశోధన ద్వారా అర్థమవుతుంది. ఆపిల్ లో ఇన్ని బ్యాక్టీరియాలు ఉంటాయని తెలియడంతో చాలామంది తినడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.