Lakshadweep : లక్షద్వీప్ భారత్ లో ఎలా భాగమైందో తెలుసా?
Lakshadweep : ఇప్పుడు ఏ నోట విన్నా.. లక్షద్వీప్ చర్చనే కొనసాగుతోంది. ప్రధాని మోడీ లక్షద్వీప్ ను పర్యటించాలనడం, మల్దీవ్ కు కోపం రావడం ఇలా వెంట వెంటనే జరిగిపోయాయి. సరే.. అదంతా పక్కన పెడితే అసలు లక్షద్వీప్ చరిత్ర ఏంటి? అవి భారత్ లోకి ఎలా వచ్చాయి. వాటిని ఏ దేశం ఆక్రమించుకోవాలని చూసింది. లాంటి విషయాలను ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
లక్షద్వీప్ 36 చిన్నా, పెద్ద దీవుల సమాహారం. 1947, ఆగస్టు 15న ఇండియాకు స్వతంత్రం వచ్చింది. కొద్ది రోజుల తర్వాత దేశానికి దూరంగా నివసిస్తున్న ఈ ద్వీపవాసులకు దేశ స్వాతంత్ర్యం గురించిన సమాచారం తెలిసింది. నిజానికి స్వతంత్రం రావడానికి నెల ముందే మద్రాస్ ప్రెసిడెన్సీ భారతదేశ స్వాధీనంలోకి వచ్చినప్పుడే లక్షద్వీపములు వాటంతట అవే భారతదేశ స్వాధీనంలోకి వచ్చాయి. లక్ష ద్వీప్ లో మొదట జనాభా అంతా హిందువులే ఉండేవారు. కానీ భారత్ ను ముస్లింలు పాలించిన సమయంలో వారంతా ఇస్లాంను స్వీకరించారు.
ముస్లిం జనాభా అధికంగా ఉన్న కారణంగా ఈ ద్వీప సమూహాలను పాకిస్థాన్ తన స్వాధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించింది. అప్పటి ఉపప్రధాని, రక్షణమంత్రి ఉక్కు మనిషి అనిపించుకున్న సర్ధార్ వల్లాభాయ్ పటేల్ లక్షద్వీప్ ను భారత్ లో కలపాలని అనుకున్నాడు. దీంతో ఆయన రాయల్ ఇండియన్ నేవీని లక్షద్వీపములకు పంపాడు. అక్కడికి చేరుకున్న ఇండియా ఆర్మి దీవులపై భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశాయి.
భారతీయ యుద్ధనౌక చేరుకునే సరికి లక్ష ద్వీపాలకు సమీపంలో ఉన్న పాకిస్థాన్ రాయల్ పాకిస్థాన్ నేవీకి చెందిన యుద్ధనౌక వెనుదిరిగి కరాచీకి వెళ్లిపోయింది. 1956లో అధికంగా మళయాళీలు నివసిస్తున్న ఈ ద్వీపాలను స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ ఏక్ట్ ఆధారంగా ప్రధాన భూభాగం నుంచి వేరు చేయబడి కొత్తగా ఒక యూనియన్‌గా రూపొందించబడ్డాయి.
దీనికి సంబంధించని మరికొన్ని చిత్రాలు ఇక్కడ చూడండి..