Tourist Spots : నగరంలో పర్యాటక ప్రదేశాలేవో తెలుసా?

Tourist Spots

Tourist Spots in Hyderabad

Tourist Spots in Hyderabad : మనకు సెలవులు వచ్చినప్పుడు మనం పర్యాటక ప్రాంతాలు తిరగాలని అనుకుంటాం. మన రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేయాలని భావిస్తుంటాం. దీని కోసం చూడాల్సిన ప్రదేశాలు ఎంచుకుంటాం. ఇందులో మన రాజధాని హైదరాబాద్ లో ఉన్న పర్యాటక ప్రాంతాలేవో తెలుసుకుని వాటిని చూడాలని అనుకోవడం సహజమే. దీని గురించి మనం వివరాలు తెలుసుకోవడం మంచిది.

ఐటీ పార్కులు, రెస్టారెంట్లు మెట్రో స్టేషన్లు, ప్రస్తుతం నగరంలో ఉన్న ప్రాంతాల్లో మొదటిది లేక్ ఫ్రంట్ పార్క్. హెచ్ ఎండీఏ ఆధ్వర్యంలో కొద్ది నెలల క్రితం ప్రారంభమైన లేక్ ఫ్రంట్ పార్క్ ఒకటి. ఇందులో ఒక్కొక్కటి 500 మీటర్ల రెండు వాకింగ్ ట్రాక్ లున్నాయి. సందర్శకులు ఇక్కడి నుంచి రెండు లేక్ వ్యూను తిలకించేందుకు వీలుగా రూ.26.65 కోట్ల అంచనా వ్యయంతో పార్కును రూపొందించారు.

సోలార్ సైకిల్ ట్రాక్ ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 23 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ను రూపొందించింది. కారు, సైకిల్ పార్కింగ్, ఫుడ్ స్టాల్స్, సైకిల్ రిపేర్, రెంటల్ స్టేషన్లు, ప్రథమ చికిత్స స్టేషన్లు, విశ్రాంతి ప్రాంతాలు, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సిగ్నలింగ్ ఉన్నాయి. దీన్ని దర్శిస్తే కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.

దుర్గంచెరువుకూడా మంచి పర్యాటక ప్రదేశంగా ఉంది. 40 మీటర్ల పొడవు ఉన్న రెండు మ్యూజికల్ ఫౌంటైన్లు ఏర్పాటు చేశారు. వాటిని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. సంగీత సౌండ్ ట్రాక్ లను అందుబాటులోకి తెచ్చారు. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు సందర్శించడానికి అనుమతి ఉంటుంది. దీంతో ఇక్కడకు వచ్చి సంతోషంగా కాలం గడపొచ్చు.

TAGS