Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న ఇండస్ట్రీ హిట్ మూవీ ఏదో తెలుసా?
జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన ఒక మూవీని మరో హీరో చేసి భారీ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ప్రత్యేకత వల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఆ వ్యక్తి టాప్ హీరోగా ఎదిగిపోయారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన కిక్ సినిమాలో మొదటగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించాల్సింది. సురేందర్ రెడ్డి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ను అడిగినపుడు ఎన్టీఆర్ డేట్స్ ఖాళీ లేవు. కొన్ని రోజులు ఆగు చేద్దాం అని అన్నరంటా..
కానీ చాలా ఎక్కువ రోజులు సమయం అడిగే సరికి సురేందర్ రెడ్డి అన్ని రోజులు అంటే కుదరదు అని రవితేజ తో సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే కిక్ సినిమాను రవితేజతో తీశారు. దీంతో కిక్ సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. దీంతో రవితేజ కెరీర్ అమాంతం పైకి వెళ్లిపోయింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు చేయాలనుకున్న సినిమాలు మరొకరు చేయడం వారు వద్దనుకున్న సినిమాలు సూపర్ డూపర్ హిట్ లు కావడం సర్వ సాధారణం. కానీ జడ్జిమెంట్ విషయంలో తప్పుడు నిర్ణయాలు కొన్నిసార్లు కెరీర్ ను అగాధంలోకి తోసేస్తాయి. కాబట్టి వ్యక్తి అయినా సినీ హీరో అయినా జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ సంఘటన గుర్తుకు తెస్తుంది.