cricketer : క్రికెటర్ కావాలనుకుని విలన్ గా మారిన నటుడు ఎవరో తెలుసా?
cricketer : ఆయన ఒక విలన్. భాషతో సంబంధం లేకుండా అనేక వందల సినిమాల్లో నటించారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతోొ కష్టపడ్డారు. 1990 నుంచి ఈ మధ్య వరకు అనేక సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు. ఆయనే అసాధారణ నటుడు ముఖేష్ రిషి. నరసింహ నాయుడు, ఇంద్ర సినిమాల ద్వారా తెలుగులో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించుకున్నాడు.
ముఖేష్ రిషి ఒక్కడు సినిమాలో మహేశ్ బాబుకు తండ్రిగా కూడా యాక్ట్ చేశాడు. బృందావనం మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కు తండ్రిగా నటించి మెప్పించాడు. తెలుగులో పాటు హిందీలో కూడా అనేక సినిమాల్లో విలన్ గా యాక్ట్ చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖేష్ రిషి1956 ఏప్రిల్ 7న జమ్మూలో పుట్టాడు. ఈయన తండ్రి వ్యాపార వేత్త కావడంతో ముందుగా తండ్రి అడుగుజాడల్లో నడవాలని అనుకున్నాడు. కానీ ముఖేష్ రిషికి క్రికెెట్ అంటే ఇష్టం ఉండటంతో అటు వైపు వెళ్లాడు. పంజాబ్ యూనివర్సిటీలో ఆయన కెప్టెన్ గా కూడా చేశాడు. వ్యాపార రీత్యా తండ్రి ముంబైకి షిప్టు కావడంతో ముంబై చేరుకున్నాడు. ఆ తర్వాత ఫిజీ దేశం వెళ్లి అక్కడ ఒక డిపార్ట్ మెంట్ లో స్టోర్ మేనేజర్ గా పని చేశాడు.
ముఖేష్ రిషి మోడలింగ్ కూడా చేశాడు. ఆ సమయంలోనే చిత్ర పరిశ్రమలోకి రావాలని అనుకున్నాడు. తండ్రి మరణించడంతో వ్యాపారంలోకి అడుగుపెట్టిన అతడికి వ్యాపారాలు చూసుకోవాలని కుటుంబ సభ్యులు సూచించారు. కానీ తనకు సినిమాల్లో విలన్ గా నటించాలని ఉందని తన మనసులోని మాటను చెప్పాడు. కుటుంబం ఓకే చెప్పడంతో యాక్టింగ్ స్కూల్ లో చేరి నటనలో నిష్ణాతుడిగా బయటకు వచ్చాడు. 1993లో యష్ చోప్రా తీసిన సినిమాలో మొదటగా కనిపించాడు.
టీవీ సీరియల్ టిప్పు సుల్తాన్ లో విలన్ పాత్రలో కనిపించి మెప్పించాడు. అనంతరం తెలుగు, హిందీ, సౌత్ ఇండియా మూవీల్లో నటించి తన పేరును గుర్తుండేలా చేసుకున్నాడు. ప్రస్తుతం సినిమాలు ఎక్కువగా చేయకున్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు.