అలాంటి సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్న ఒక వ్యక్తి ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా ఫేమస్ అయిపోయారు. అతడే గోపరాజు రమణ. ఈయన 2004 సంవత్సరం లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టగా ఆయనకు సరైన అవకాశాలు రాలేవు.వచ్చినా అవి సక్సెస్ కాలేకపోయాయి.
అయితే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ హీరోగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంలో ఆయన తండ్రి పాత్ర పోషించాడు. గోపరాజు రమణ ఆనంద్ దేవరకొండ కు తండ్రిగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ లో తన నటన విశ్వరూపం చూపించాడు.
దీంతో గోపరాజుకు భారీగా అవకాశాలు వచ్చాయి. గోపరాజు రమణ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సంవత్సరంలో ఏకంగా గోపరాజు రమణ 12 చిత్రాల్లో నటించారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం వస్తున్న ప్రతి సినిమాలో కూడా గోపరాజు రమణ కనిపిస్తున్నారు
తనదైన యాస లో చెబుతున్నా డైలాగులకు అందరూ ఫిదా అయిపోతున్నారు.
గోపరాజు రమణ కొడుకు గోపరాజు విజయ్ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న గోపరాజు విజయ్ కూడా చాలా రోజులు అవకాశాల కోసం ఎదురు చూసినట్లు తెలుస్తోంది. విజయ్ సామజ వరగమన చిత్రంలో నటించగా అది ఫుల్ హిట్ అయ్యింది. ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా బిజీబిజీగా మారిపోయారు.