T20 Prize Money : టీ 20 ఫ్రైజ్ మనీ ఎంతంటే..

T20 Prize Money

T20 Prize Money

T20 Prize Money : ఈ సారి టీ 20 వరల్డ్ కప్ ఫ్రైజ్ మనీని ఐసీసీ భారీగా పెంచేసింది. గత సీజన్ లో ఇచ్చిన దాని కంటే ఎక్కువగా ఫ్రైజ్ మనీ పెంచినట్లు ఐసీపీ తన అధికారిక ట్విటర్ లో ప్రకటించింది. విన్నర్ కు రూ. 20.38 కోట్లు, రన్నరప్ కు 10.38 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అన్ని జట్లకు గాను రూ. 93 కోట్లకు పైగా ఫ్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

సెమీస్ ఆడే జట్లకు రూ. ఆరున్నర కోట్లకు పైగా ఫ్రైజ్ మనీ వస్తోంది. 2022 సంవత్సరంలో ఐసీసీ ఇచ్చిన ఫ్రైజ్ మనీ కంటే దాదాపు రెండు రెట్లు పెంచేసింది. ఈ టోర్నీలో ఆడే 20 జట్లకు కూడా నగదు ప్రోత్సహాకాలు ఇచ్చి క్రికెట్ ను మరింత విస్తరించాలని భావిస్తోంది. 13 నుంచి 20 స్థానాల్లో ఉన్న జట్లకు 1.87 కోట్లు, 9 నుంచి 12 స్థానాల్లో ఉండే జట్లకు రూ. 3.17 కోట్లు, సెమీస్ కు వెళ్లిన జట్లకు చెరో ఆరున్నర కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది.

టీ 20 ఫ్రైజ్ మనీ 2022 లో 46.54 కోట్లు ఉండగా.. ఈ సారి ఏకంగా 93 కోట్లకు పైగా పెంచింది. గత విన్నర్ ఇంగ్లండ్ జట్టు కేవలం 13. 6 కోట్లతో సరిపెట్టుకోగా.. ఈ సారి విన్నర్ కు ఏకంగా రూ. 20.38 కోట్లు ఇవ్వనుంది. ఇలా భారీగా ఫ్రైజ్ మనీ పెంచడం వెనక పెద్ద రహస్యమేమీ లేదు. క్రికెట్ ను ప్రతి దేశానికి విస్తరించి విశ్వవ్యాప్తం చేస్తూ సాకర్ తరహలో ఫేమస్ చేయాలని ఐసీసీ భావిస్తోంది.

రాబోయే ఒలంపిక్స్ లో టీ 20 క్రికెట్ ప్రవేశపెట్టనున్నారు. ఒలంపిక్స్ లో పాల్గొనే చాలా జట్లలో క్రికెట్ ఆడనవి ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో క్రికెట్ పై మక్కువ పెంచుకునేలా ఆయా దేశాల్లో క్రికెట్ ను అభివృద్ధి చేయడానికి తీసుకున్న నిర్ణయం అని తెలుస్తోంది.

TAGS