JAISW News Telugu

Power Star : పవర్ స్టార్ మూవీ రీషూట్ కి వెళ్లాల్సిందేనా? డైరెక్టర్ మార్పులు చేస్తున్నాడా!

Power Star

Power Star Ustaad

Power Star : చాలా గ్యాప్ తర్వాత ఇటీవల హరిహర వీరమల్లు సెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు  పవర్ స్టార్.  పవన్ కల్యాణ్ మళ్లీ మేకప్ వేసుకోవడంతో అభిమానులు సంబుర పడిపోతున్నారు. త్వరలో తమ అభిమాన హీరో సినిమా రాబోతున్నదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పనిలో పనిగా ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా పూర్తి చేస్తాడని భావిస్తున్న తరుణంలోఓ  పిడుగు లాంటి వార్త బయటకు వచ్చింది.

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మిగతా సినిమాను పూర్తి చేసే బాధ్యతను దర్శకుడు జ్యోతి కృష్ణ తీసుకున్నారు. షూటింగ్ ఆలస్యం కారణంగానే తప్పుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. మొన్నటి వరకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా పవన్ మళ్లీ ఎప్పుడు కెమెరా ముందుకు వస్తాడో తెలియని పరిస్థితి. దీంతో క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇక ఓజీ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యింది. ఇందులో రాజకీయ అంశాలు లేకపోవడంతో రీ షూట్ కు వెళ్లే అవకాశాలు లేవు.

అభిమానులు కోరుకున్నదే జరిగిందా?..

ఇక తర్వాత లైన్ లో ఉన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇది తమిళ హిట్ మూవీ తేరి రీమేక్ అని ఇటీవల మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ల టైమ్ లో వెల్లడించారు డైరెక్టర్ హరీశ్ శంకర్.  అప్పటి నుంచి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో మిస్టర్ బచ్చన్ సినిమా ప్లాఫ్ కావడంతో ఈ రచ్చ మరింత ముదిరింది. తమిళ తేరి సినిమా తెలుగులో పవన్ ఇమేజ్ కు సరితూగదని, మార్పులు చేయాలని భావిస్తున్నారు. రీ షూట్ కు మరో కారణం కూడా ఉందని తెలుస్తున్నది. ఈ సినిమా ఎన్నికలకు ముందు స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నది. అప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో ఆ సమయానికి తగ్గట్లు సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేశారు.

ప్రస్తుతం పవన్ డిప్యూటీ సీఎంగా ఉండడంతో మార్పులు తప్పదని తెలుస్తున్నది. అలాగే కథానుగుణంగా కొన్ని ట్విస్టులు జోడించి రీ షూట్ చేయాలని భావిస్తున్నారట.  అటు పవన్ అభిమానుల ఒత్తిడి, ఇటు రాజకీయ పరిణామాల కారణంగా మార్పులు తప్పవని తెలుస్తున్నది. తమిళ తేరి సినిమాని మక్కీ కి మక్కీ అలాగే దించితే ప్లాఫ్ తప్పదంటున్నారు అభిమానులు. దీంతో హరీశ్ కూడా మనసు మార్చుకోని మార్పులకు సిద్ధమయ్యాడట. రీషూట్ కారణంగా ఈ సినిమా ఎప్పుడొస్తుందో వేచి చూడాల్సిందే.

Exit mobile version