Bank Accounts : బ్యాకింగ్ వ్యవస్థ సరళీకృతం.. కస్టమర్లను ఫ్రెండ్లీగా మార్చడం వంటి సమీకరణాలు చేపడుతున్నరు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ మేరకు బ్యాంకులు తమ ప్రక్రియలను క్రమబద్ధీకరించుకోవలసిన అవసరాన్ని కేంద్రం వివరించింది. దీనితో కస్టమర్లు బ్యాంకింగ్ సేవలు, రుణాలు పొందడం సులభతరం చేస్తుంది.
లోన్ విషయంలో
బ్యాంకు నుంచి రుణం పొందాలంటే కస్టమర్ కు క్లిష్టమైన విధానంగా ఉండేది. దీంతో కస్టమర్లు చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ ప్రక్రియను సులభతరం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా రుణాలను పొందేందుకు వీలు కల్పించింది.
కస్టమర్-ఫ్రెండ్లీ బ్యాంకింగ్
కస్టమర్ల సంతృప్తి, సౌలభ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకులకు కేంద్రం సూచిస్తోంది. సకాలంలో సేవలు అందించడం, తక్కువ సమయంలో ఎక్కువ వివరాలను ఖాతాదారులకు చేరవేయడం లాంటి వాటితో పారదర్శకత నిర్ధారించడంపై దృష్టి పెట్టాలని చెప్తున్నారు.
ప్రధాన బ్యాంకుల్లో..
ICICI, SBI మరియు HDFC వంటి ప్రధాన బ్యాంకుల్లో మొదట కొత్త నియమాలు అమలు చేస్తున్నారు. ఈ బ్యాంకులు బ్యాంకింగ్ రంగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. కొత్త మార్గదర్శకాలకు కట్టుబడి ఉండడం ఇతర బ్యాంకుల కంటే వేగంగా స్పందించడం ఉదాహరణగా నిలుస్తుందని భావిస్తున్నారు.
ట్రస్ట్ అండ్ కనెక్టివిటీ పెంపొందించడం
కస్టమర్ కనెక్టివిటీ ద్వారా బ్యాంకుల మధ్య నమ్మకాన్ని పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యం. బ్యాంకులు, కస్టమర్ల మధ్య మంచి బంధం కనెక్టివిటీ పెరిగేందుకు దారి తీస్తోంది. ఇది 2 పార్టీలకు ప్రయోజనంగా ఉంటుంది.
బ్యాంకింగ్ వ్యవస్థను సరళీకృతం చేయడం, కస్టమర్ సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం ద్వారా బ్యాంకింగ్ రంగంపై సానుకూల ప్రభావం పడుతుందని, కస్టమర్లకు బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.