T20 : వన్డే ప్రపంచ కప్ లో బోల్తాపడిన భారత్ జట్టు టీ20 మ్యాచ్ లో మాత్రం తన తడాఖా చూపుతోంది. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో చెత్త పర్ఫార్మెన్స్ తో విమర్శలు ఎదుర్కొంది. తక్కువ స్కోరుకే పరిమితమై పరువు తీసుకుంది. కప్ కంగారూలకు అప్పగించి విమర్శలు మూటగట్టుకుంది. కానీ టీ20లో మాత్రం చెలరేగిపోతోంది. ఆడాల్సిన చోట వెనుకబడి ఇప్పుడు మెరుపులు మెరిపిస్తోంది.
నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. కీలక సమయంలో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వేగవంతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఇదే ఇన్నింగ్స్ ఫైనల్ లో ఆడితే గెలిచేవాళ్లం. కానీ ఇప్పుడు ఆడినా ఏం లాభం అనే వాదనలు వస్తున్నాయి. మన బ్యాటర్లు కీలక సమయంలో ఆడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
వన్డే మ్యాచ్ ల్లో అంతగా రాణించక విమర్శలు ఎదుర్కొన్నాడు సూర్య. టీ20లో తన బ్యాట్ తడాఖా చూపిస్తున్నాడు. భారీగా పరుగులు రాబట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అద్బుతమైన బ్యాటింగ్ తో అలరిస్తున్నాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఈనేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ గురించి చెప్పుకోవడం సహజం.
ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు ఇంగ్లిస్ శతకంతో విధ్వంసం చేసినా చివరకు ఆస్ట్రేలియాకు ఓటమే మిగిలింది. మన విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం సూర్యకుమార్ యాదవే. ఇలా ఆస్ట్రేలియాను కట్టడి చేసి విజయం సాధించిన భారత్ వన్డే క్రికెట్లో ఎందుకు వెన్ను చూపిందనే వాదనలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా టీ20ల్లో రాణించినంత సులభంగా వన్డేల్లో రాణించడం లేదని తెలుస్తోంది.