JAISW News Telugu

Spouse : మీ జీవిత భాగస్వామి మిమ్మల్నిబాగా కట్టడి చేస్తున్నట్లు అనిపిస్తోందా.. వాటి లక్షణాలు ఇవే

spouse

spouse

spouse : సంసా జీవితంలో సుఖం, దు:ఖం అనేది రెండు భాగాలు. చాలా మంది జీవితాల్లో కొన్ని విచిత్రమైన పరిస్థితులు నెలకొంటాయి. వాటిలో ముఖ్యమైనవి ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడం లేదా మ్యానుపలేట్ చేయడం. ఇలా చేయడం వల్ల అనేక రకాల సమస్యలు పుట్టుకొస్తుంటాయి. కొన్ని కొన్ని సార్లు జీవిత భాగస్వామిలో ఎవరైనా మిమ్మల్ని ఎక్కువగా కట్టడి చేస్తున్నట్లు అనిపిస్తుంటుంది.

అవి అనిపించడంలో మొదటి లక్షణం ఎక్కువగా మీరు తప్పు చేయకున్నా.. మీరు తప్పు చేసినట్లు నిరూపించేందుకు ప్రయత్నించడం. తద్వారా మిమ్మల్నిఅపరాధ భావనకు గురిచేస్తూ ఎప్పుడూ కించపరుస్తూ ఉండటం. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల మానసికంగా మిమ్మల్ని కుంగిపోయేలా చేస్తున్నారని అర్థం. ఇదే మొదటి లక్షణంగా చెప్పుకోవచ్చు.

రెండోది ఎప్పుడు మీరు చేసే చిన్న పనులను కూడా విమర్శించడం. చిన్న చిన్న విమర్శలు చేసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటారు. ఇలా చేయడం వల్ల మానసికంగా కుంగిపోయేలా చేసి ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ముఖ్యంగా వాస్తవాల్ని వ్యతిరేకిస్తూ ఎప్పుడూ వ్యక్తిగతంగా హనన చేయడం, దూషణలకు దిగడం దీన్ని గ్యాస్ లైటింగ్ అంటారు. అంటే వ్యక్తిగత అభిప్రాయాలను ఎప్పుడు తప్పుగా వక్రీకరించే విధంగా చూడటం ముఖ్యమైన అలవాటు.

చివరిది ముఖ్యంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ మ్యానుపులేటర్లు వాడుకునే పదునైన ఆయుధం అని చెప్పొచ్చు. దీన్ని ఉపయోగించి అనేక రకాలుగా బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. చిన్న విషయానికే గొడవపడి ఏడ్చేసి సదరు జీవిత భాగస్వామిని దూషిస్తూ తిరిగి వారే ఏడుస్తారు. దీంతో ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి ఆనందిస్తుంటారు. ఇలా జీవిత భాగస్వామి విషయంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే మీరు వీటిన్నింటికి లొంగినట్లయితే మీరు మీ జీవిత భాగస్వామి చేతిలో కట్టడి అవుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వ్యక్తిగతంగా ఎక్కడా కూడా లొంగకుండాా మీకు మీరు హాయిగా జీవించేలా ప్లాన్ చేసుకోవాలి.

Exit mobile version