Voter Slip : తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రచార పర్వం పూర్తయింది. రాజకీయ పార్టీలు తమకు ఓటు వేయలని ఇన్ని రోజులు అర్థించారు. ఓటరు స్లిప్పులు కూడా పంపిణీ చేశారు. కొందరికి స్లిప్పులు అందలేదు. దీంతో వారు కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. కొందరికి ఓటరు స్లిప్పులు రాలేదు. దీంతో వారు నిరాశపడాల్సిన అవసరం లేదు.
ఓటరు స్లిప్పులు రాని వారు voters.eci.gov.in/కి వెళ్లి search in Electoral Rollపై క్లిక్ చేయాలి. అందులో మీ వివరాలు లేదా Epic నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే వివరాలు తెలుసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మన ఓటరు స్లిప్పు అందుకోవచ్చు. ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
ఓటరు స్లిప్పులు లేనంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అందించే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అనవసర భయాలు పెట్టుకోకుండా ఓటు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, జాతీయ ఉపాధి హామీ గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్ బుక్ ఏది ఉన్నా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇలా ఓటు హక్కు గురించి లేని పోని అపోహలు పెట్టుకోకుండా దర్జాగా ఓటు వేయచ్చు. దొంగ ఓట్లు పడకుండా చూడాలి. కానీ మనమే దొంగ ఓటు వేయొద్దు. ఇలా మన ఓటు హక్కు వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటుహక్కుకు సార్థకత తీసుకురావాలి.