English : ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడాలంటే ఇవి చేయండి?
English : చాలా మంది ఇంగ్లీష్ లో అనర్గళం గా మాట్లాడాలని అనుకుంటారు. కానీ అస్సలు మాట్లాడలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ప్రయత్నించడం మానేసి మనకెందుకు లే అని ఊరుకుంటారు. కానీ ప్రయత్నిస్తే ఏదైనా సులభమే. ప్రయత్న లోపం ఉండకూడదు. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటం కోసం కొన్ని ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా కమ్యూనికేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ . ప్రతిదీ ఊహించుకునే సమయంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఊహించుకోవాలి.
ఆంగ్లంలో రోజూ మాట్లాడాలంటే ముందు సాధన చేయడం ప్రారంభించాలి. యూట్యూబ్ లో, గూగుల్ లో ఇంగ్లీష్ మాట్లాడేందుకు అనేక టిప్స్ ఉంటాయి. వాటిని ఫాలో కావాలి.
ట్రాన్స్ లేట్ చేయడం తగ్గించి ఆంగ్లంలో మాట్లాడేందుకు ప్రయత్నించడం వల్ల మెల్లి మెల్లిగా ఇంప్రూవ్ అవుతారు.
చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడే వారు ఉంటే వినండి, ఆ తర్వాత వారు మాట్లాడుతున్న విధానం ఎలా ఉందో పరిశీలించండి
కొత్త పదాలను నేర్చుకోెవడం అలవాటు చేసుకోవాలి. రోజూ ఇంగ్లీష్ పేపర్ చదివితే కొన్ని కొత్త పదాలు కనిపిస్తాయి. వాటిని రాసుకుని గుర్తుంచుకోవాలి. అవి ఎక్కడో ఓ చోట పనికి వస్తాయి. దీంతో పదజాలం పెరుగుతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పదజాలం చాలా ఇంపార్టెంట్.
ఇంగ్లీష్ సినిమాలు చూసే సమయంలో కింద స్క్రోల్ అయ్యే పదాలు చూడండి. వీటి వల్ల చాలా వరకు ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవచ్చు.
ఇడియమ్స్ వాటి అర్థాలు నేర్చుకోవడం వల్ల ప్రసంగాలు చెప్పే సమయంలో చాలా ఉపయోగపడతాయి. అంతే కాకుండా రోజూ ఇంగ్లీష్ లో అద్దం ముందు నిల్చొని మాట్లాడటం ప్రాక్టీస్ చేయాలి. దీని వల్ల కమ్యూనికేషన్, తడబడకుండా మాట్లాడటం అలవాటు అయిపోతుంది.