JAISW News Telugu

Janasena : జనసేనలో ఆ అనుమానాలు ఉన్నాయా?

Janasena

Janasena

Janasena : తెలుగు దేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. కేవలం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికే కూటమిగా కంకణం కట్టుకున్నాయి. కానీ కూటమిగా ఏర్పడిన నాటి నుండే రాజకీయ వర్గాల్లో అనుమానం తలెత్తింది. పలు పార్టీల కీలక నేతల్లో కూడా కూటమి ఏర్పడిన తరువాత రాజకీయ సమీకరణాలపై అంతర్గతంగా గణాంకాలు చేపట్టాయి. రాజకీయ మేధావులు కూడా  జనసేన పోటీ చేస్తున్న స్థానాలపై కూడికలు, తీసివేతలు చేపట్టారు. వీరందరితో పాటు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా ఎక్కడో కొంత అనుమానం వచ్చింది. అభిమానులతోపాటు జనసేన సైనికులు, కీలకమైన నాయకుల మెదల్లో కూడా అనుమానం మొలకెత్తింది.

వీరందరిలో అనుమానం రావడానికి కారణాలు అనేకంగా కనబడుతున్నాయి. 2014 లో జనసేన పార్టీ పురుడు పోసుకుంది. ఆ ఏడాది ఎన్నికల్లో పార్టీ పోటీచేయలేదు. 2019 లో బీఎస్పీ, వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేసింది. కానీ స్వయంగా రెండుచోట్ల పోటీ చేసిన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమిపాలయ్యారు. దింతో పార్టీకి కోలుకోలేని పెద్ద దెబ్బ తగిలింది. 2019 లో జనసేన 5.5 శాతం మాత్రమే ఓట్లు సాధించింది.

2024 లో జరుగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు.ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో మితృలతో కలిసి పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 స్థానాల్లో గత ఎన్నికల్లో ఒక్క స్థానం నుంచి కూడా గెలవలేదు. ఓటమిపాలైన స్థానాల్లోనే పార్టీ తన అభ్యర్థుల్ని బరిలో దింపడం విశేషం. తాజాగా జరుగబోయే ఎన్నికల్లో పార్టీ కనీసం ఆరు శాతం ఓట్లు సాదించాలి. 21 స్థానాల్లో 50 శాతం పైబడి ఓట్లు సాధిస్తేనే పార్టీకి గుర్తింపు హోదా ఎన్నికల కమిషన్ వద్ద ఉంటుంది.

లేదంటే సాధారణ పార్టీగానే గమనిస్తుంది ఎన్నికల కమిషన్. ఈ ఎన్నికల్లో నిబంధనలు మేరకు 21 శాతం ఓట్లు సాధించని నేపథ్యంలో పార్టీ గుర్తింపు కోల్పోతుంది. పార్టీ ఎన్నికల గుర్తు కోసం మరోసారి వెతుకులాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీకి ఇప్పుడు పోటీ చేస్తున్న 21 స్థానాల్లో మాత్రమే గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం విశేషం.

జనసేన అధినేత పవన్ ను నమ్ముకొని వచ్చిన కాపు కులస్తులకు తాజా ఎన్నికలు పరీక్షగా నిలిచాయి. ఈ ఎన్నికల్లో ఆరు శతం మెజార్టీ రాని నేపథ్యంలో మా పరిస్థితి ఏమిటనే ఆలోచనలో పడ్డారు కాపు పెద్దలు. గతంలో గెలువని స్థానాలు, అంతగా పార్టీ ప్రభావం లేని స్థానాలను టీడీపీ కేటాయించి, పార్టీ ఉనికి లేకుండా చేయడానికేనని జనసేన నాయకులు పలువురు ఆరోపించడం విశేషం.

Exit mobile version