Everest Viral Video : ప్రపంచంలో అత్యతంత ఎత్తయినది శిఖరం ఎవరెస్ట్. ఈ శిఖరాన్ని అధిరోహించాలని పర్వతారోహకులు భావిస్తుంటారు. కానీ అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక కొందరు తమ ప్రయత్నాన్ని విరమించుకుంటారు. అలాంటి వారి కోసం చైనాకు చెందిన ఓ డ్రోన్ తయారీ సంస్థ ఎవరెస్ట్ అందాలను చిత్రీకరించింది. డీజేఐ గ్లోబల్.. డ్రోన్ కెమెరా సహాయంతో ఈ అద్భుతమైన వీడియోను చిత్రీకరించింది. శిఖరం తాజా పరిస్థితులను చిత్రీకరించి ప్రజల కళ్లముందుంచింది. ఈ వీడియోలో ఎవరెస్ట్ పర్వతం ప్రకృతి చెక్కిన పాలరాతి బొమ్మలా కనిపిస్తున్నంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిది.
వీడియో చిత్రీకరణ ఇలా
ఎవరెస్టు శిఖరాన్ని డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించేందుకు డీజేఐ గ్లోబల్ సంస్థ చాలానే శ్రమించింది. సముద్రమట్టానికి 3,500 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంపు వరకు చేరుకుని అక్కడి నుంచి డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరణ జరిపారు. అక్కడి నుంచి శిఖరం అగ్రభాగం మీదుగా వెళ్తూ.. అక్కడి దృశ్యాలను డ్రోన్ షూట్ చేసింది. ఎవరెస్టు శిఖరం ఎక్కుతున్న వారిని, దిగుతున్నవారిని కూడా ఈ వీడియోలో మనం వీక్షించవచ్చు. శిఖరానికి సమీపంలో ఉన్న హిమనీ నదాలు, తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లుగా ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రకృతి అందాలతో అబ్బుర పరుస్తున్న ఈ వీడియోను చైనాకు చెందిన వారు ఎక్స్(ట్విట్టర్) లో పోస్టు చేస్తున్నారు.
లక్షలాది వీక్షణలు
ఈ వీడియోను ఎక్స్( ట్విట్టర్) లో పోస్టు చేసిన గంటల్లోనే లక్షలాది వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను వీక్షించిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చేసిన తర్వాత ఎవరెస్ట్ ఎక్కాలన్న సంకల్పం మరింత
బలపడిందని మరికొందరు కామెంట్లు పెట్టారు. చాలా అందమైన, ఆహ్లాద కరమైన వీడియో అని ఇంకొంత మంది కామెంట్ చేశారు. బెస్ట్ ఎవరెస్ట్ వీడియో అని కాంప్లిమెంట్లు ఇస్తున్నారు.
ప్రపంచంలోనే ఎత్తన పర్వతం ఇదే
ఎవరెస్టు.. ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం ఇది. సముద్రమట్టానికి 8,848 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది నేపాల్‌లో ఉంది. ఈ పర్వతాన్ని నేపాలీలు ఈ పర్వతాన్ని గౌరీశంకర శిఖరం అని పిలుస్తుంటారు. ఈ శిఖరాన్ని లక్పా షెర్పా అత్యధికంగా ఏడుసార్లు అధిరోహించారు.
ఎవరీ లక్పా షెర్పా..
లక్పా షెర్పా.. నేపాల్‌కు చెందిన పర్వతారోహకురాలు. ప్రపంచంలోకెల్లా ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఆమె ఏడుసార్లు అధిరోహించిన మొట్టమొదటి మహిళగా రికార్డులకు ఎక్కారు. ఇక ఎవరెస్ట్‌ను అధిరోహించిన నేపాల్‌కు చెందిన మొదటి మహిళ కూడా ఆమె కావడం గమనార్హం. నేపాల్‌లోని మకలులో పెరిగారు. ఆమె తల్లిదండ్రులకు 11 మంది పిల్లలు. లక్మా రోమన్ అమెరికన్ జాతికి చెందిన జార్జ్ డిజ్మారెస్కును 2002లో పెళ్లి చేసుకున్నారు .వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. లక్మా 2016లో ఏడోసారి ఎవరెస్ట్‌ను అధిరోహించి రికార్డు సృష్టించారు..
26 సార్లు అధిరోహించిన రీటా..
నేపాల్‌లోని సోలుకుంబు జిల్లా థేమ్‌లో జన్మించిన ప్రసిద్ధ పర్వతారోహకుడు కమీ రీటా ఒకరు. ఇతను ఇప్పటి వరకు ఈ ఎవరెస్టు శిఖరాన్ని 26 సార్లు అధిరోహించారు. అత్యంత నిష్ణాతుడైన నేపాలీ.. షెర్పా గైడ్. ప్రపంచంలో ఎవరెస్టు శిఖరాన్ని అధికసార్లు అధిరోహించిన మొదటి వ్యక్తిగా చేసింది. 2018 మే నుంచి ఎవరెస్టు శిఖరాన్ని అత్యధికంగా అధిరోహించిన రికార్డు కూడా కమీ రీటా పేరిటనే ఉన్నది. 2021, మే 7న నెలకొల్పిన తన రికార్డును తానే బద్ధలు కొట్టాడు. 2023, మే 17న 27వ సారి అధిరోహించాడు.
Chinese drone maker @DJIGlobal shared a breathtaking video of its DJI Mavic 3 Pro flying over Mount Everest on Weibo yesterday. The drone ascended 3,500 meters from the base camp to the summit of the highest mountain in the world. pic.twitter.com/Iwyoe45DtS
— Yicai 第一财经 (@yicaichina) July 10, 2024