JAISW News Telugu

Omar Abdullah : జమ్మూ కశ్మీర్ లో ఎలాంటి కుట్రలకు పాల్పడొద్దు: ఒమర్ అబ్దుల్లా

Omar Abdullah

Omar Abdullah

Omar Abdullah : జమ్మూ కశ్మీర్ లో ప్రజాతీర్పును గౌరవించాలని, ఎలాంటి కుట్రలను తెరలేపవద్దని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ముఖ్యనేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ దూసుకెళుతోంది. ఇక్కడ కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 52 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 28, పీడీపీ 2 సీట్లలో ముందంజలో ఉన్నాయి. ఈ క్రమంలో ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కాశ్మీర్ లో తమ విజయం ఖాయమని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం ఈ రోజు తెలుస్తుందని, అయితే ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత ఉండాలన్నారు. ప్రజాతీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే వారు ఎలాంటి ట్రిక్స్ ను ప్లే చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దని సూచించారు.
Exit mobile version